మంటల్లో 35 ఫోన్లు: ఆ కష్టమర్లకు శాంసంగ్ డబుల్ బొనాంజా

By Hazarath
|

శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 కష్టమర్లకు శాంసంగ్ డబుల్ బొనాంజా ఆఫర్ ని ప్రకటించింది. ఈ మధ్య లాంచ్ చేసిన గెలాక్సీ నోట్ 7 ఫోన్లు బ్యాటరీలు పేలిపోతున్నాయనే ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ఆ ఫోన్లన్నింటినీ వెనక్కు పిలిపిస్తోంది.అయితే ఈ ఫోన్ల స్థానంలో ఎస్ 7 ఫోన్లను కాని అలాగే ఎస్7 ఎడ్జ్ ఫోన్లను గాని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కష్టమర్లకు ఎలాంటి ఇబ్బంది రానివ్వమని స్పష్టం చేసింది.

 

అమ్మకాల సునామిలో గెలాక్సి నోట్ 7..సప్లయిలేక శాంసంగ్ విలవిల

#1

#1

నెల రోజుల క్రిత‌మే శాంసంగ్ నోట్ 7ను విడుద‌ల చేసింది. అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆ ఫోన్ల‌పై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లు కాలిపోతున్నాయని ఛార్జింగ్ పెట్ట‌గానే ఆ ఫోన్లు మండిపోతున్నాయని సంస్థకు లెక్కకు మించి ఫిర్యాదులు అందాయి

#2

#2

ఇప్పటివరకు 35 ఫోన్లు పేలిపోయినట్లు గుర్తించడంతో ప్రపంచవ్యాప్తంగా అమ్మిన నోట్ 7 ఫోన్లను వెనక్కి పిలుస్తున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. దీంతో ఆ ఫోన్లను ఇప్పుడు రికాల్ చేస్తున్నారు.

#3

#3

ఇప్పటివరకు సుమారు ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల శాంసంగ్ నోట్ 7 ఫోన్లు అమ్ముడుపోయాయి. వాటి స్థానంలో ఎస్ 7 ఫోన్లను కాని అలాగే ఎస్7 ఎడ్జ్ ఫోన్లను గాని ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

#4
 

#4

వచ్చే వారంలో ఈ ఫోన్లను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో పాటు బ్యాటరీ పేలిపోయిన కస్టమర్లకు 25 డాలర్ల ఫోన్ బిల్లు లేదా 25 డాలర్ల గిఫ్ట్ కార్డును కూడా ఇవ్వనున్నట్లు చెప్పింది.

#5

#5

అయితే నోట్ 7 అమ్మకాలు తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామన్నది మాత్రం సంస్థ స్పష్టం చేయలేదు. కాగా .. భారత మార్కెట్లోకి ఈ ఫోన్ ఇంకా అందుబాటులోకి రాలేదు.

#6

#6

అయితే గెలాక్సీ 7 నోట్ లు పేలుతున్నాయన్న వార్త సంస్థ ఈక్విటీపైనా తీవ్ర ప్రభావం చూపింది. ఒక్కసారిగా తన మార్కెట్ విలువను కోల్పోయింది.

#7

#7

కాగా శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు అందుకున్న కష్టమర్లు కష్టమర్ సర్వీస్ నంబర్ 0330 726100 కాల్ చేసి ఫోన్ రీ ప్లేస్ మొంట్ పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఇది యుకెలో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది.

#8

#8

అలాగే యుఎస్ లో ఈ ఫోన్ అందుకున్నవారు కష్టమర్ కేర్ నంబర్ 1-800-726-7864 (1-800-SAMSUNG)కు అలాగే ఆస్ట్రేలియాలో ఉన్నవారు 1300 362 603. వెంటనే కాల్ చేసి ఫోన్ రీ ప్లేస్ మెంట్ పొందవచ్చు.

#9

#9

శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫీచర్లు
5.7 ఇంచ్ క్వాడ్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 2560 × 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, ఎస్ పెన్ స్టైలస్
హార్ట్రేట సెన్సార్, ఫింగర్ప్రింట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, బారోమీటర్
4 జీ ఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సి
3600 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్లెస్ చార్జింగ్, ఫాస్ట్ చార్జింగ్

 

 

Best Mobiles in India

English summary
Here Write How to replace your Samsung Galaxy Note 7

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X