Redmi Note 5 Proలో ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను సెటప్ చేసుకోవటం ఎలా..?

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి (Xiaomi) ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన రెడ్‌మి నోట్ 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను రోల్ అవుట్ చేసింది.

|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి (Xiaomi) ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసిన రెడ్‌మి నోట్ 5 ప్రో స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను రోల్ అవుట్ చేసింది. ఓవర్-ద-ఎయిర్ రూపంలో ఈ అప్‌డేట్ అందుతుంది. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమైన ఈ రోల్ అవుట్ ప్రక్రియ అన్ని రెడ్‌మి నోట్ 5 ప్రో డివైస్‌లకు వర్తిస్తోంది. 1.6జీబి నిడివితో ఉన్న ఈ అప్‌డేట్ MIUI v9.2.4 NEIMIEK బిల్డ్ నెంబర్‌తో వస్తోంది. ఈ అప్‌డేట్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌తో పాటు కెమెరాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌లను కూడా షావోమి అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అప్‌డేట్‌ను అందుకునే సమయంలో ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ లెవల్స్ 50 శాతంగా ఉండాలి, ఇదే సమయంలో 2జీబి స్టోరేజ్ స్పేస్ ఖాళీ ఉండాలి. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి >About Phone -> Software Updateను చెక్ చేసుకోవటం ద్వారా మాన్యువల్‌గా ఈ అప్‌డేట్‌ను పొందే వీలుంటుంది.

ఛార్జింగ్ స్లో కావడానికి 7 ప్రధాన కారణాలుఛార్జింగ్ స్లో కావడానికి 7 ప్రధాన కారణాలు

 ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను సెటప్ చేసుకనేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను సెటప్ చేసుకనేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

అప్‌డేట్ తీసుకున్న తరువాత ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను సెటప్ చేసుకనేందుకు ఈ క్రింది ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి.. ఫోన్ సెట్టింగ్స్ మెనూలోని సిస్టమ్ అండ్ డివైస్ సెక్షన్‌లోకి వెళ్లి Lock screen & password ఆప్షన్ పై ట్యాప్ చేయండి. అక్కడ మీకు ‘Add face data' అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై ట్యాప్ చేసినట్లయితే ఫేస్ అన్‌లాక్ ఫీచర్ సెట్టింగ్స్‌కు సంబంధించి ఓ పేజీ ఓపెన్ అవుతుంది.

ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో అవుతూ ముఖాన్ని ఎన్‌రోల్ చేసుకోండి..

ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో అవుతూ ముఖాన్ని ఎన్‌రోల్ చేసుకోండి..

సెట్టింగ్స్‌ను అవగాహన చేసుకున్న తరువాత Next బటన్ పై క్లిక్ చేసి సంబంధిత ఇన్‌స్ట్రక్షన్స్‌ను ఫాలో అవుతూ మీ ముఖాన్ని ఎన్‌రోల్ చేసుకోవల్సి ఉంటుంది. మీ ఫేస్ విజయవంతంగా యాడ్ అయిన తరువాత అదనపు సెట్టింగ్స్‌ను కూడా మీరు మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది.

రెడ్‌మి నోట్ 5 ప్రో స్పెసిఫికేషన్స్...

రెడ్‌మి నోట్ 5 ప్రో స్పెసిఫికేషన్స్...

5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ ఎంఐయూఐ 9 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా‌కోర్ సాక్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ 4,000mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ విత్ 4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై ఇంకా జీపీఎస్ సపోర్ట్.

రెడ్‌మి నోట్ 5

రెడ్‌మి నోట్ 5

స్నాప్‌డ్రాగన్‌625 ప్రాసెసర్‌ కింద బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, లేక్ బ్లూ రంగుల్లో లాంచ్ అయిన షియోమీ రెడ్‌మీ నోట్ 5 స్మార్ట్‌ఫోన్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ వేరియెంట్లలో రూ.9,999, రూ.11,999 ధరలకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభ్యం కానుంది.


రెడ్‌మి నోట్ 5 ఫీచర్లు
5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్‌ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12 ఎంపీ బ్యాక్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
Xiaomi promised to roll out the Face Unlock feature for the Redmi Note 5 Pro during the launch event. As promised, the brand has now started rolling out the feature on its latest Redmi Note 5 Pro via over-the-air (OTA) update.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X