సామ్‌సాంగ్ గెలాక్సీ ఏస్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌డేట్ చేయటమెలా..?

Posted By: Staff

సామ్‌సాంగ్ గెలాక్సీ ఏస్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్‌కు అప్‌డేట్ చేయటమెలా..?

 

గెలాక్సీ ఏస్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ అప్‌డేట్‌ను సామ్‌సంగ్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.  అయితే CyanogenMod 9 ROM అనే సాఫ్ట్‌వేర్‌ను గెలాక్సీ ఏస్‌‌లో ఇన్స్‌టాల్  చేసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ ఐసీఎస్ తరహా అనుభూతులను ఆస్వాదించవచ్చు. ఈ అప్‌డేట్‌కు సంబంధించి  ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్న పలు ఆండ్రాయిడ్ 4.0 వర్షన్‌లు సురక్షితమైనవి కావు. తికమక పడి వీటిని డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే  మీ డివైజ్‌కు ముప్పువాటిల్లే ప్రమాదముంది.  అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా డౌనో‌లోడ్ చేసుకోవటం ఉపయుక్తం... గెలాక్సీ ఏస్ యూజర్లు సులువైన నిబంధనలను అనుసరించి ఈ అప్‌డేట్‌ను పొందవచ్చు.. వాటి వివరాలు తెలుసుకుందాం:

-  ముందుగా సదురు ఆండ్రాయిడ్ 4.0.1 సాఫ్ట్‌వేర్‌ను పీసీలోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

-  ఆ తరువాత ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయాలి.

-  పీసీలో ఉన్న ఆ సాఫ్ట్‌‌వేర్ జిప్ ఫైల్‌ను మొబైల్ ఎస్డీ కార్డ్‌లోకి కాపీ చేసుకోవాలి,

-  కాపీ ప్రక్రియ పూర్తి అయిన  అనంతరం కంప్యూటర్ నుంచి మొబైల్‌ను వేరు చేయాలి,

-  అనంతరం వైప్ డేటా ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని  వైప్ చేస్ పార్టీషన్‌ను ఎంచుకోవాలి,

-  స్టోరేజ్ ఇంకా ఫార్మాట్ సిస్టంను ఎంచుకున్న తరువాత ఎస్డీ కార్డులో కాపీ కాబడి ఉన్న ఆండ్రాయిడ్ జిప్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

-  ఇప్పుడు ఫోన్‌ను ఓసారి రిబూట్ చేస్తే సరిపోతుంది.

Read in Hindi

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting