మీ పాత ఫోన్ అమ్మేస్తున్నారా, ఈ విషయాలు బాగా గుర్తు పెట్టుకోండి

చాలా మంది తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను వేరొకరికి విక్రయించే ముందు, ఆ ఫోన్‌లోని వ్యక్తిగత డేటాను డిలీట్ చేసేందుకు "Factory Reset" నిర్వహిస్తారు. అయితే, ఫ్యాక్టరీ రీసెట్ నిర్వహించినంత మాత్రాన ఫోన్ డేటా పూర్తిగా డిలీట్ అయిపోతుందనుకోవటం పూర్తిగా అపోహే అంటున్నారు సైబర్ నిపుణులు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Factory Reset నిర్వహించినా డేటా రికవర్ చేసే వీలుంటుంది..

Factory Reset నిర్వహించిన మీ ఫోన్‌ల నుంచి తిరిగి డేటాను రికవర్ చేసే అవవాశముంటుందని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మరి ఇటువంటి సమయంలో మీ పాత స్మార్ట్‌ఫోన్‌లోని డేటాను పూర్తిగా శాస్వుతంగా తొలగించటం ఎలా..?

Encrypt చేయవల్సిన అవసరం ఉంది

మీ ఫోన్‌కు ప్యాక్టరీ రీసెట్ నిర్వహించే ముందు ఫోన్ డేటాను పూర్తిగా Encrypt చేయవల్సిన అవసరం ఉంది.

data encryptionను ఎనేబుల్ చేసేకోవాలంటే

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో data encryption ఆప్షన్‌ను ఎనేబుల్ చేసేకోవాలంటే Settings > Security > Encrypt phoneలోకి వెళ్లండి.

ఫ్యాక్టరీ రీసెట్ నిర్వహించే ముందు

ఫ్యాక్టరీ రీసెట్ నిర్వహించే ముందు డేటా ఎన్‌క్రిప్షన్‌ను ఎనేబుల్ చేసి ఉంచటం వల్ల ఫోన్‌లోని డేటా మొత్తం అర్థం కాని విధంగా చెల్లాచెదురు కాబడుతుంది.

డేటాను వేరొకరు రికవర్ చేయటం సాధ్యపడదు

ఫ్యాక్టరీ రీసెట్ నిర్వహించటం వల్ల ఫోన్‌లోని డేటాను వేరొకరు రికవర్ చేయటం సాధ్యపడదు. ఒకవేళ వారు చేయాలని ప్రయత్నించినప్పటికి పాస్‌వర్డ్ అడుగుతుంది.

junk informationతో నింపేయండి

ఎన్‌క్రిప్ట్ కాబడిన మీ ఫోన్‌కు ప్యాక్టరీ రీసెట్ నిర్వహించిన తరువాత ఫోన్ మొత్తం junk informationతో నింపేయండి. ఈ ఓవర్ రైటింగ్ ప్రక్రియ ద్వారా ఫోన్‌లో స్టోర్ అయి ఉన్న సెన్సిటివ్ డేటా మొత్తం తొలగించబడుతుంది.

ఫ్యాక్టరీ రీసెట్ పూర్తి అయిన తరువాత

ఫ్యాక్టరీ రీసెట్ పూర్తి అయిన తరువాత ఎటువంటి ఆన్‌లైన్ అకౌంట్‌లలోకి లాగిన్ కాకండి. ఈ విధంగా ఫ్యాక్టరీ రీసెట్ కాబడిన మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను వేరొకరికి విక్రయించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to wipe your phone before you sell it. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot