ఐఫోన్ ఎక్స్ అభిమానులకు శుభవార్త చెప్పిన ఆపిల్
ఐఫోన్ అభిమానులకు ఆపిల్ కంపెనీ సరికొత్త ఆఫర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ ఎక్స్ రిలీజింగ్ సమయంలో అది అనేక సమస్యలను ఎదుర్కున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఐఫోన్ అభిమానులకు ఆపిల్ కంపెనీ సరికొత్త ఆఫర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ ఎక్స్ రిలీజింగ్ సమయంలో అది అనేక సమస్యలను ఎదుర్కున్న సంగతి అందరికీ తెలిసిందే. 2017లో టెక్ గెయింట్ దిగ్గజం ఆపిల్ టచ్ స్క్రీన్ లో కొన్ని సమస్యలను ఎదుర్కున్న సంగతి తెలిసిందే.కాగా అఫిషియల్ సపోర్ట్ పేజీలో కంపెనీ ఆఫిల్ ఐఫోన్ వాడే యూజర్లు టచ్ స్క్రీన్ లో ఏదైనా సమస్యలుంటే వెంటనే రీప్లేస్ చేస్తామని తెలిపింది. అది ఉచితంగా రీప్లేస్ చేస్తామని కంపెనీ తెలిపింది. ఈ మేరకు తన అధికారిక పేజీలో ఓ ప్రకటనను విడుదల చేసింది. మరి ఐఫోన్ టచ్ స్క్రీన్ పాడయిందో లేదో ఎలా తెలుసుకోవాలి అనే దానిపై ఐఫోన్ ఎక్స్ వాడేవారు ఈ కింది వాటి ద్వారా తెలుసుకోవచ్చు.

ఆపిల్ స్టేట్ మెంట్ ప్రకారం....
ఆపిల్ స్టేట్ మెంట్ ప్రకారం రెండు దారుల్లో ఈ సమస్యను తెలుసుకోవచ్చు. మొదటిది డిస్ ప్లే కాని డిస్ ప్లే పార్ట్ కాని టచ్ చేస్తున్నప్పుడు రెస్పాండ్ కాకపోతే అది సమస్యగా గుర్తించవచ్చు. ఇక రెండోది టచ్ చేసినప్పటికీ అది ఎటువంటి చలనం లేకుండా అలాగే ఉండటం వల్ల కాని లేకుంటే టచ్ చేయకుండానే అది సమస్యలను సృష్టించడం ద్వారా కాని సమస్య ఉందని తెలుసుకోవచ్చు.

ఐఫోన్ ఎక్స్ డిస్ ప్లే ప్రాబ్లం కనిపిస్తుంటే...
ఈ సమస్యలతో మీ ఐఫోన్ ఎక్స్ డిస్ ప్లే ప్రాబ్లం కనిపిస్తుంటే ఆపిల్ కంపెనీ ఈ సమస్యను ఉచితంగా ఫిక్స్ చేస్తుంది. మీరు ఆపిల్ షో రూంకి ఐఫోన్ ఎక్స్ డిస్ ప్లే సమస్యతో వెళ్లినప్పుడు నేరుగా అక్కడి వారిని సంప్రదించి ఉచిత రీప్లేస్ మెంట్ గురించి అడగవచ్చు.

ఐఫోన్ క్రాక్ అయితే...
అయితే ఆపిల్ కంపెనీ దీని మీద కొన్ని కండీషన్లను పెట్టింది. ఐఫోన్ క్రాక్ అయితే దానికి కొన్ని షరతులతో కూడిన రీప్లేస్ మెంట్ చేస్తుంది. అందుకోసం మీరు కొంత మొత్తాన్ని పే చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ టచ్ పనిచేయని పక్షంలో మాత్రమే ఉచిత రీప్లేస్మెంట్ ఉంటుంది.

ఐపోన్ iPhone XS and iPhone XS Max ఫోన్లు....
కాగా ఐపోన్ iPhone XS and iPhone XS Max ఫోన్లు లాంచ్ అయినప్పటికీ ఐఫోన్ ఎక్స్ కి క్రేజ్ ఏ మాత్రం ఇప్పటికీ తగ్గడం లేదు. ఈఫోన్ నాచ్ డిస్ ప్లేతో రావడం కూడా అదనపు బలంగా మారింది. కాగా గతేడాది ఈ ఫోన్ లాంచ్ అయిన తరువాత ఈ టచ్ ప్రాబ్లంపై ఎటువంటి కంప్లయింట్లు రాలేదు. ఈ ఏడాది మాత్రం వరుసగా కంప్లయింట్లు రావడంతో కంపెనీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.


Click it and Unblock the Notifications








