హెచ్‌పి నుంచి త్వరలో రెండు తక్కువ ధర ఫాబ్లెట్‌లు!!

Posted By:

 హెచ్‌పి నుంచి త్వరలో రెండు తక్కువ ధర ఫాబ్లెట్‌లు!!

ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ హ్యూలెట్ ప్యాకర్డ్(హెచ్‌పి) భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన ఓ కీలక నివేదిక వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయిన హెచ్‌పి తాజా వ్యూహంలో భాగంగా ఏడాది చివరినాటికి రెండు సరికొత్త ఫాబ్లెట్‌‌లను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్మార్ట్‌ఫోన్ అలానే టాబ్లెట్ కంప్యూటర్‌లా ఉపయోగించుకోగలిగే ఈ డివైజ్‌లను 6 అంగుళాలు, 7 అంగుళాలు స్ర్కీన్ వేరియంట్‌లలో డిజైన్ చేసినట్లు సదరు నివేదిక ద్వారా తేటతెల్లమవుతోంది.

ఇండియా, చైనా ఇంకా ఫిలిప్పిన్స్ మార్కెట్ల పై హెచ్‌పి దృష్టిసారించినట్లు నివేదిక ద్వారా వెల్లడవుతోంది. అయితే, విడుదల కాబోతున్న రెండు ఫాబ్లెట్‌లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిప్తాయా లేక మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తాయా అన్న అంశం పై సందిగ్థత నెలకొని ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot