ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి HP Pre 3

Posted By: Staff

ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి HP Pre 3

కంప్యూటర్ రంగంలో హెచ్‌పి అనే పేరు తెలియని వారు ఉండరు. ఏదో ఒక సమయంలో హెచ్‌పి తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ వాడుతుండడమే ఇందుకు కారణం. కంప్యూటర్స్, లాప్ టాప్స్ తయారీ రంగంలో హెచ్‌పి అందవేసిన చేయి. ఇటీవల కాలంలో కంప్యూటర్ల రంగం నుండి మొబైల్ తయారీ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అంతకు ముందు కూడా హెచ్‌పి నుండి చాలా రకాలైన స్మార్ట్ ఫోన్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి హెచ్‌పి కంపెనీ విడుదల చేయాల్సిన కొన్ని మొబైల్ ఫోన్స్ డెవలప్‌మెంట్ స్టేజిలో ఉండగా ఎలాగైనా సరే 2015కల్లా మొబైల్ సెగ్మెంట్‌లో కూడా తన సత్తా చూపించాలని ఊవిళ్లు ఊరుతుంది హెచ్‌పి కంపెనీ.

ఇక హెచ్‌పి కంపెనీ విడుదల చేయనున్నటువంటి లేటెస్ట్ కొత్త మొబైల్ HP Pre 3. ప్రస్తుతానికి ఈ మొబైల్ గ్లోబల్‌గా లభ్యమవుతుందని తెలిపారు. ఇండియాలో త్వరలో విడుదలవుతున్నటువంటి ఈ స్మార్ట్ పోన్ ధర రూ 28,000గా నిర్ణయించవచ్చునని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్ లెవెల్ స్మార్ట్ పోన్‌కి ఏమేమి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయో అన్ని అటువంటి అన్ని రకాల స్పషల్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ పోన్ స్క్రీన్ సైజు 3.5 ఇంచ్ ఉండడమే కాకుండా యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందజేస్తుంది. ఈ స్మార్ట్ రన్ అయ్యేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ వెబ్ ఓయస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆండ్రాయిడ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల కన్నా వెబ్ ఓయస్ చాలా బెటర్‌గా ఉంటుందని అన్నారు.

HP Pre 3 ఉన్న కెమెరా హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్ సామర్ద్యంతో ఎల్ఈడి ప్లాష్ తోపాటు, ఆటోఫోకస్ కూడా దీని ప్రత్యేకం. 3జి నెట్ వర్క్‌కి సంబంధించి వీడియో కాలింగ్ కోసం ముందు భాగాన్ ఉన్న కెమెరా అనుకూలంగా ఉంటుంది. మల్టీమీడియా విషయానికి వస్తే ఇందులో మల్టీమీడియాకి సంబంధించి లెటేస్ట్ అప్లికేషన్స్ అన్ని పోందుపరచడం జరిగింది. హై డెఫినేషన్ వీడియో ఫార్మెట్స్ h263, h264లాంటి అన్నింటిని ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే 3జి, Wireless LAN, బ్లూటూత్ టెక్నాలజీలను సపోర్ట్ చేస్తుంది.

The notable HP Pre 3 specifications:

Web OS
Powerful processor
5 Mega Pixel camera
3G
Wi-Fi and Bluetooth
720p video recording
FM Radio
Java

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting