హెచ్‌పి నుండి ఇక వెబ్ ఓఎస్ ఆధారిత స్మార్ట్ ఫోన్స్ రావు...

Posted By: Staff

హెచ్‌పి నుండి ఇక వెబ్ ఓఎస్ ఆధారిత స్మార్ట్ ఫోన్స్ రావు...

కొత్త ఉత్పత్తులు, సాప్ట్ వేర్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టే హ్యూలెట్ ప్యాకర్డ్ ఇటీవల కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ కఠిన నిర్ణయం ఏమిటంటే వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్(WebOS) ఆధారంగా పని చేసేటటువంటి కంప్యూటర్స్‌కి, టాబ్లెట్స్‌కి ఇక మీదట సర్వీస్‌ని అందించడం లేదని తెలిపారు. ఇలా అర్దాంతరంగా వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీస్‌ని నిలపివేయడం వెనుక మరో కొత్త అద్బుత సృష్టిని మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు మార్కెట్లో ఉన్న రూమర్. ఈ విషయాన్ని హ్యూలెట్ ప్యాకర్డ్ ల్యాప్ ట్యాప్ తయారీదారులకు వెల్లిడించినది సమాచారం.

ఇది మాత్రమే కాకుండా హ్యూలెట్ ప్యాకర్డ్ కంపెనీ కొత్తగా తన యొక్క పర్సనల్ సిస్టమ్స్ గ్రూప్‌కే సాప్ట్ వేర్ కేటాయించనుందని వినికిడి. ఈ కొత్త సాప్ట్‌వేర్‌తో హ్యూలెట్ ప్యాకర్డ్ సంబంధించిన టచ్ ప్యాడ్, టాబ్లెట్స్ త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. పోయిన సంవత్సరం హ్యూలెట్ ప్యాకర్డ్ పామ్ అనే టాబ్లెట్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని గురించి తెలుసుకుంటే మార్కెట్లో ఈరోజు హ్యూలెట్ ప్యాకర్డ్ ఇంత ఎత్తు ఎదగడానికి, మార్కెట్లో ఉన్న షేర్స్‌లలో తనవైపుకి ఆకర్షించడంలో ఎంతో పాత్ర పోషించనేది అందరికి తెలిసిన విషయమే.

హ్యూలెట్ ప్యాకర్డ్ త్వరలో విడదల చేయనున్న కొత్త సర్వీస్ తప్పని సరిగా ఓ సరిక్రొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఐతే గతంలో హ్యూలెట్ ప్యాకర్డ్ కంపెనీ నుండి వెబ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ దానిని విరమించుకున్నట్లు సమాచారం. త్వరలో హ్యూలెట్ ప్యాకర్డ్ నుండి హ్యూలెట్ ప్యాకర్డ్ పామ్ టచ్ ప్యాడ్, పామ్ ప్రీ 3‌ని ఇండియాలో విడుదల చేయనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot