ఆన్‌లైన్ మార్కెట్లోకి హెచ్‌టీసీ 8ఎస్.. రూ.3000 తగ్గింపు!

Posted By: Prashanth

ఆన్‌లైన్ మార్కెట్లోకి హెచ్‌టీసీ 8ఎస్.. రూ.3000 తగ్గింపు!

 

తైవాన్ టెక్ దిగ్గజం హెచ్‌టీసీ స్మార్ట్‌‍ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచకుంది. ఈ బ్రాండ్ గత సెప్టంబర్‌లో హెచ్‌టీసీ 8ఎక్స్, హెచ్‌టీసీ 8ఎస్ మోడళ్లలో రెండు విండోస్ 8 స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్‌లను నవంబర్‌లో ప్రకటించారు. ఈ మోడళ్లలో ‘హెచ్‌టీసీ 8ఎస్’ ఆన్‌లైన్ విక్రయాలు‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘సాహోలిక్ డాట్ కామ్’ తన లిస్టింగ్స్‌లో ఉంచింది. ఇండియన్ మార్కెట్లో 8ఎస్ అసలు ధర రూ.21,999కాగా సాహోలిక్ హ్యాండ్‌సెట్‌ను రూ.3,000 తగ్గింపుతో రూ.18,990కి ఆఫర్ చేస్తోంది. మరో మోడల్ హెచ్‌టీసీ 8ఎక్స్‌ను ప్లిప్‌కార్ట్ సహా పలు రిటైలర్లు రూ.35,032కు ఆఫర్ చేస్తున్నారు.

ల్యాప్‌టాప్ తొడల పై పెట్టుకుంటే.. వీర్య కణాలు మటాష్!

హెచ్‌టీసీ 8ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లు:

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 4 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే(రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1గిగాహెర్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా (720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్గింగ్ సౌలభ్యత), 720 పిక్సల్ హైడెఫినిషన్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 16 మెగాపిక్సల్ ఇన్-బుల్ట్ మెమెరీ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, బ్లటూత్ 2.1, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై a/b/g/n, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లోనాస్, మైక్రోయూఎస్బీ 2.0, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బింగ్ మ్యాప్స్, ఎక్స్‌బాక్స్ లైవ్‌గేమ్స్, హెఫ్టీ 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot