హెచ్‌టీసీ 8ఎక్స్ vs నోకియా లూమియా 920 (బిగ్ ఫైట్)

Posted By: Super

హెచ్‌టీసీ 8ఎక్స్ vs నోకియా లూమియా 920 (బిగ్ ఫైట్)

 

నోకియా విండోస్ 8 స్మార్ట్‌ఫోన్ లూమియా 920కు షాకిస్తూ హెచ్‌టీసీ 8ఎక్స్ పేరుతో సరికొత్త విండోస్ 8 స్మార్ట్‌ఫోన్‌ను న్యూయార్క్‌లో ఆవిష్కరించింది. నవంబర్ నాటికి అందుబాటులోకి రానున్న ఈ హ్యాండ్‌‍సెట్ లూమియా 920 అమ్మకాల పై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో రెండు ఫోన్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు ముఖాముఖిగా..

Read in English

డిజైన్:

హెచ్‌టీసీ 8ఎక్స్: బరువు 130 గ్రాములు, చుట్టుకొలత 132.35 x 66.2 x 10.12మిల్లీమీటర్లు

లూమియా 920: బరువు 185 గ్రాములు, చుట్టుకొలత 130.3 x 70.8 x 10.7మిల్టీ మీటర్లు,

డిస్‌ప్లే:

హెచ్‌టీసీ 8ఎక్స్: 4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్  1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్,

లూమియా 920: 4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటవ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్,

ఆపరేటింగ్ సిస్టం:

హెచ్‌టీసీ 8ఎక్స్: విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,

లూమియా 920: విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,

ప్రాసెసర్:

హెచ్‌టీసీ 8ఎక్స్: డ్యూయల్ కోర్ 1.5గిగాహెర్జ్  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,

లూమియా 920: డ్యూయల్ కోర్ 1.5గిగాహెర్జ్  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,

కెమెరా:

హెచ్‌టీసీ 8ఎక్స్: 8 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్, 2.1 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

లూమియా 920:  8.7 మెగాపిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటోఫోకస్, జియో-టాగింగ్, ప్యూర్‌వ్యూ కెమెరా టెక్నాలజీ), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

స్టోరేజ్:

హెచ్‌టీసీ 8ఎక్స్: 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 512జీబి ర్యామ్, బీట్స్ ఆడియో టెక్నాలజీ, మెమరీ స్టోరేజ్

లూమియా 920: 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 7జీబి మైక్రోసాఫ్ట్ స్కై డ్రైవ్ స్టోరేజ్,

కనెక్టువిటీ:

హెచ్‌టీసీ 8ఎక్స్:  నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ), బ్లూటూత్ v2.1+EDR, వై-ఫై 802.11 a/b/g/n.

లూమియా 920: హెచ్‌ఎస్‌డీపీఏ, హెచ్‌ఎస్‌యూపీఏ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై  802.11 a/b/g/n, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ.

బ్యాటరీ:

హెచ్‌టీసీ 8ఎక్స్: 1800ఎమ్ఏహెచ్ Li-Po బ్యాటరీ,

లూమియా 920: 2,000ఎమ్ఏహెచ్  Li-ion బ్యాటరీ (టాక్ టైమ్ 10 గంటలు, స్టాండ్ బై 400 గంటలు),

తీర్పు:

ఈ రెండు విండోస్ 8 స్మార్ట్‌ఫోన్‌లు ఇంచు మించు సమాన ఫీచర్లను ఒదిగి ఉన్నాయి. 8ఎక్స్‌లో ఏర్పాటు చేసిన బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, లూమియా 920లో నిక్షిప్తం చేసిన వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్లు ఆధునీకతను సంతరించుకున్నాయి. ఈ రెండు గ్యాడ్జెట్ లలో మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ వ్యవస్థ లోపించినప్పటికి  ఇంటర్నల్ మెమెరీ విషయంలో లూమియా 920 ముందంజలో ఉంది. కెమెరా విషయంలోనూ నోకియా హెచ్ టీసీ 8ఎక్స్‌కు పోటీనివ్వగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot