ఇంటర్నెట్‌లో ఆ ఫోటోలు.. రియాల్టీని తలపిస్తున్నవైనం!

Posted By: Super

 ఇంటర్నెట్‌లో ఆ ఫోటోలు.. రియాల్టీని తలపిస్తున్నవైనం!

 

హెచ్‌‍టీసీ తాజాగా ఆవిష్కరించిన  విండోస్ 8 స్మార్ట్‌ఫోన్  ‘హెచ్‌టీసీ 8ఎక్స్’కు  టెక్నాలజీ నిపుణుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధానంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 8 మెగా పిక్సల్ కెమెరా ఎఫ్/2.0 లెన్స్‌ను కలిగి ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీని అందిస్తోంది. లూమియా 920లో నిక్షిప్తం చేసిన ‘ప్యూర్ వ్యూ’ కెమెరా తరహాలో  హెచ్‌టీసీ 8ఎక్స్ లోని 8 మెగాపిక్సల్ కెమెరా ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో సింగపూర్‌కు చెందిన ప్రముఖ టెక్నాలజీ బ్లాగ్  ‘టెక్‌గూండూ’ (Techgoondu) ఓ రోజంతా వెచ్చించి హెచ్‌టీసీ 8ఎక్స్‌ కెమెరా ద్వారా వివిధ ఫోటోగ్రాఫ్‌లతో పాటు వీడియోలను చిత్రీకరించింది. వాటిలో కొన్ని ఫోటోగ్రాఫ్‌ల రియాల్టీని తలపిస్తున్నాయి...

Read in English:

హెచ్‌టీసీ 8ఎక్స్ ఫీచర్లు:

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 చిప్‌సెట్ (క్లాక్ వేగం 1.5గిగాహెర్జ్), 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ బీఎస్ఐ సెన్సార్, హెచ్‌టీసీ ఇమేజ్ చిప్ టెక్నాలజీ, 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సామర్ధ్యం, 2.1 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాల్స్ నిర్వహించుకునేందుకు), 16జీబి ఇన్-బుల్ట్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, బ్లూటూత్ 2.1, డ్యూయల్ బ్యాండ్ 802.11 Wi-Fi a/b/g/n, ఎన్ఎఫ్‌సీ, మైక్రోయూఎస్బీ 2.0, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బింగ్ మ్యాప్స్, ఎక్స్‌బాక్స్ లైవ్ గేమ్స్, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

htc-8x-windows-phone-8-samples-images

htc-8x-windows-phone-8-samples-images

htc-8x-windows-phone-8-samples-images-2

htc-8x-windows-phone-8-samples-images-2

htc-8x-windows-phone-8-samples-images-3

htc-8x-windows-phone-8-samples-images-3
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot