ఫోటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం..'హెచ్‌టిసి అమేజ్ 4జీ'

Posted By: Super

ఫోటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం..'హెచ్‌టిసి అమేజ్ 4జీ'

హెచ్‌టిసి మొబైల్ కంపెనీ తన కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ పోన్‌ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. దాని పేరే 'హెచ్‌టిసి అమేజ్ 4జీ'. హెచ్‌టిసి కొత్తగా మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ ఆండ్రపాయిడ్ ఫోన్‌ని మొదట్లో రూబీ అని నామకరణం చేయగా, ఆ తర్వాత దీనికి 'హెచ్‌టిసి అమేజ్ 4జీ'గా మార్కెట్లోకి విడుదల చేయడం జరుగుతుంది.

హెచ్‌టిసి కంపెనీ రూబీ అనే పేరుని తొలగించి అమేజ్ నామకరణం చేయడానికి రూబీ అనే పేరు కొంచెం డల్‌గా ఉండడమేనని అన్నారు. ఇకపోతే 'హెచ్‌టిసి అమేజ్ 4జీ' ప్రత్యేకత ఏమిటంటే దీనిని కెమెరా ఫోన్‌గా అభివర్ణించవచ్చు. కొంత మంది యూజర్స్‌కు ఫోటోగ్రఫీ అంటే చాలా ఆసక్తిని కనబరుస్తుంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్‌ని రూపొందించడం జరిగింది. 'హెచ్‌టిసి అమేజ్ 4జీ' మొబైల్ ఇమేజీలకు, వీడియోలను తీసేందుకు చక్కగా ఉపయోగపడుతుంది.

'హెచ్‌టిసి అమేజ్ 4జీ' మొబైల్‌లో 8 మెగా ఫిక్సల్‌ని వెనుక భాగాన నిక్షిప్తం చేయడం జరిగింది. కెమెరాతో పాటు డ్యూయల్ ఎల్‌ఈడి ఫ్లాష్ అదనం. ఇందులో ఉన్న "zero shutter lag“ ఫీచర్‌తో చక్కని స్నాప్ షాట్స్‌ని తీయవచ్చు. ఇంటర్నెట్లో ఉన్న సమాచారం మేరకు ఈ మొబైల్ ఏకకాలంలో ఐదు ఫోటోలను ఒకేసారి తీసి వాటిల్లో ఏది బెస్ట్ షాట్ దానిని యాజర్‌కు అందిస్తుందని వినికిడి. వీడియో కాలింగ్ ఫీచర్‌ కొసం మొబైల్ ముందు భాగంలో 2మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది.

'హెచ్‌టిసి అమేజ్ 4జీ' మొబైల్‌ ధర, ప్రత్యేకతలు:

* 1.5 GHz Qualcomm Snapdragon s3 Processor
* Memory: 1024MB RAM
* Android 2.3.4 Gingerbread with HTC Sense 3.5
* 4.3″ qHD Super LCD Display (540

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot