ఆడవారి కోసం ప్రత్యేకంగా హెచ్‌టిసి లేడీస్ స్మార్ట్ ఫోన్ బ్లిస్

Posted By: Super

ఆడవారి కోసం ప్రత్యేకంగా హెచ్‌టిసి లేడీస్ స్మార్ట్ ఫోన్ బ్లిస్

మొబైల్స్ తయారీదారులు ప్రత్యేకంగా ఆడవారిని దృష్టిలో పెట్టుకోని కూడా మొబైల్స్‌ని తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా.. కేవలం ఆడవారిని దృష్టిలో పెట్టుకోని హెచ్‌టిసి కంపెనీ 'హెచ్‌టిసి బ్లిస్' అనే మొబైల్‌ని విడుదల చేసింది. స్వతహాగా తైవాన్ మొబైల్ తయారీదారైన హెచ్‌టిసి కంపెనీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటుగా, అత్యాధునిక ఫీచర్స్‌ని కలిగి ఉన్న హెచ్‌టిసి బ్లిస్‌ని మొబైల్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.

చేతిలో ఇమిడే విధంగా తక్కువ బరువు కలిగి ఉండే విధంగా హెచ్‌టిసి బ్లిస్‌ని రూపొందించడం జరిగింది. గతంలో హెచ్‌టిసి కంపెనీ విడుదల చేసిన హెచ్‌టిసి డిజైర్‌తో పొల్చితే హాఫ్ సెంటీమీటర్ తక్కవ మందం కలిగి ఉంటుంది. హెచ్‌టిసి బ్లిస్‌ మొబైల్‌లో ప్రశాంత వాతావరణం కలిగిన వాల్ పేపర్స్ ముందుగానే లోడ్ చేయబడి ఉన్నాయి. ఇందులో అత్యంత ముఖ్యమైన అప్లికేషన్స్‌గా షాపింగ్ అప్లికేషన్ సాప్ట్ వేర్, డైట్ క్యాలరీస్‌ని కౌంట్ చేసే సాప్ట్ వేర్‌ని లేడీస్ కొసం ప్రత్యేకంగా రూపోందించడం జరిగింది. స్మార్ట్ ఫోన్స్ విషయంలో కొత్త ఒరవడిని సృష్టించడానికే హెచ్‌టిసి బ్లిస్‌‌ని మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందని హెచ్‌టిసి అధికార ప్రతినిధులు తెలియజేశారు. హెచ్‌టిసి బ్లిస్‌ ఫీచర్స్‌ని క్లుప్తంగా పరిశీలిస్తే..

హెచ్‌టిసి బ్లిస్‌ మొబైల్ ఫీచర్స్:
నెట్ వర్క్
3G నెట్ వర్క్: HSDPA/UMTS 900, 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు

ఫామ్ ఫ్యాక్టర్: Candybar

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Multi Touch, Pinch to zoom, Accelerometer sensor for UI auto-rotate, Predictive Text Input

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 OS
సిపియు: Single processor with an 800 MHz

స్టోరేజి కెపాసిటీ
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot Support For Memory Expansion Up To 32GB
బ్రౌజర్: HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కనెక్టివిటీ & కమ్యూనికేషన్
బ్లూటూత్ & యుఎస్‌బి: Bluetooth v2.1 with A2DP & v2.0 micro USB
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n
హెడ్ సెట్: 3.5mm stereo headset jack
రేడియో: Stereo FM radio with RDS, FM Transmitter
జిపిఎస్: A-GPS
3జీ: Up to 7.2 Mbps download speed, Up to 2.0 Mbps upload speed

మ్యూజిక్ & వీడియో
మ్యూజిక్ ఫార్మెట్: MP3, WMA, M4A (Apple lossless), M4B
వీడియో ఫార్మెట్: MPEG4, WMV, 3GP, 3G2

బ్యాటరీ
టైపు: Li-Ion Standard battery

వేర్ ఫీచర్స్: Adobe Flash Player, Android Market, Facebook, Twitter, Picasa, Digital Compass

మార్కెట్లో లభించే కలర్స్: Black

ప్రస్తుతానికి ఇవి మాత్రమే హెచ్‌టిసి బ్లిస్‌ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ లీక్ అవ్వడం జరిగింది. త్వరలోనే హెచ్‌టిసి బ్లిస్‌ మొబైల్‌కి చెందిన మరిన్ని విషయాలను తెలియజేస్తాం. ఇకపోతే మార్కెట్లో దీని ధర కూడా ప్రస్తుతానికి వెల్లిడంచలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot