మార్కెట్లోకి హెచ్‌టిసి విండోస్ ఫోన్ 7.5 డివైజెస్

Posted By: Super

మార్కెట్లోకి హెచ్‌టిసి విండోస్ ఫోన్ 7.5 డివైజెస్

గ్లోబల్ మొబైల్ కమ్యూనిటీలో విండోస్ పోన్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌కు వచ్చినటువంటి రెస్పాన్స్‌ని బట్టి మైక్రోసాప్ట్ కంపెనీ విండోస్ ఫోన్ 7.5 మ్యాంగ్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్‌ని ఫిజిట్సుతో కలసి తోషిబా సెప్టెంబర్ చివరికల్లా ఇండియన్ మొబైల్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తోషిబా సంగతి అలా ప్రక్కన ఉంచితే హెట్ టిసి మొబైల్ కంపెనీ త్వరలో రెండు విండోస్ ఫోన్ 7.5 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన డివైజెస్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ రెండు మొబైల్స్‌కి సంబంధించిన పూర్తి సమాచారం డచ్ మొబైల్ స్టోర్ వెబ్‌సైట్‌లో ఉంచడం జరిగింది.

ఈ విషయం తెలిసిన హెచ్‌టిసి కంపెనీ మేము ఇంకా మొబైల్స్ గురించి ఎటువంటి సమాచారం అందివ్వక ముందే మీరు ఎలా వెబ్‌సైట్‌లో పెట్టారంటూ ప్రశ్నించగా పెట్టిన రెండు గంటలకే మొబైల్స్‌కు సంబంధించిన సమాచారం పూర్తిగా తీసివేయడం జరిగింది. ఇంటర్నెట్లో ప్రముఖ టెక్నాలజీ వెబ్ సైట్స్ చెప్పిన దాని ప్రకారం హెచ్‌టిసి త్వరలో విడుదల చేయనున్న ఈ రెండు మొబైల్స్ పేర్లు ఈ విధంగా ఉన్నాయి. ఒకటి హెచ్‌టిసి ఇజినైట్, రెండవది హెట్ టిసి ప్రైమ్. రెండు మొబైల్స్ ఇమేజెస్‌ని గనుక చూసినట్లైతే మెనుని ఈజీగా యాక్సెస్ చేసుకునేందుకు గాను మొబైల్స్‌కి ముందు భాగంలో ప్రత్యేకంగా విండోస్ బటన్స్ అమర్చడం జరిగింది.

ఇక హెచ్‌టిసి ఇజినైట్ ఫీచర్స్ గనుక చూసినట్లైతే హెచ్‌టిసి కంపెనీ నుండి గతంలో విడుదలైన హెచ్‌టిసి మోజర్ట్ మాదిరే 3.7 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉంది. వీటితో పాటు 1GHz ప్రాసెసర్, కెమెరా విషయానికి వస్తే 5 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు హైడెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని 720p ఫార్మెట్‌లో సపోర్ట్ చేస్తుంది. దీనిని గనుక తీక్షణంగా పరిశీలించినట్లైతే విండోస్ ఫోన్ సెగ్మెంట్లో బేసిక్ విండోస్ ఫోన్‌గా నిపుణులు పరిశీలిస్తున్నారు.

ఇక హెట్ టిసి ప్రైమ్ ఫీచర్స్ విషయానికి వస్తే 3.7 ఇంచ్ పుల్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండి, స్లైడింగ్ ఫిజికల్ క్వర్టీ కీప్యాడ్ దీని సొంతం. హై ఢెపినేషన్ వీడియో రికార్డింగ్ తీయడం కోసం ఇందులో 5 మెగా ఫిక్సల్ కెమెరా పోందుపరచడం జరిగింది. ఈ రెండు విండోస్ ఫోన్స్ కూడా త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. గతంలో విడుదలైన విండోస్ ఫోన్స్ ధరలతో పోల్చుకున్నట్లైతే వీటి ధర చాలా తక్కువగా ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot