త్వరలో ఇండియన్ మార్కెట్లోకి హెచ్‌టీసీ చాచా

By Super
|
HTC Cha Cha
కోనుగోలుదారుల దూకుడు నేపధ్యంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు భారతీయ సెల్ ఫోన్ మార్కెట్లో రోజు రోజుకు జోరందు కుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ల పట్ల పెరగుతున్న మక్కువను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు రోజుకో మోడల్ ను మార్కెట్లో ప్రవేశ పెడుతున్నాయి. నోకియా, హెచ్ టీసీ, శ్యామ్ సంగ్ వంటి మొబైల్ కంపెనీలు ఇప్పటికే ముందంజలో ఉంటే.. సోనీ ఎరెక్సన్, మోటరోలా, ఎల్ జీ వంటి కంపెనీలు వాటిని అనుసరిస్తున్నాయి. మైక్రో మ్యాక్స్... మ్యాక్స్.. స్పైస్ వంటి స్వదేశీ కంపెనీలు సైతం మార్కెట్లో ఈ స్మార్ట్ బ్రాండ్ లను ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

ప్రస్తుత మొబైల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ నెలకొనటంతో పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు అధిక ధరలనే వసూలు చేస్తున్నాయి. మధ్యతరగతి ప్రజానీకానికి సైతం స్మార్ట్ మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉండే విధంగా హెచ్ టీ సీ ప్రవేశపెట్టని హెచ్ టీ సీ చా..చా.. అత్యాధునిక ఆప్షన్లతో సమంజసమైన ధరకే లభిస్తుంది. ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ మొబైల్ మార్కెట్లో మంచి హిట్ కొడుతుందని నిపుణుల అంచనా. ఇప్పటికే మార్కెట్లో వివిధ ప్రయోగాలు చేసిన హెచ్ టీ సీ మరో కొత్త ప్రయోగానికి నాంది పలికింది.

హెచ్ టీ సీ కంపెనీ గతంలో ప్రవేశపెట్టిన సల్సా ఫోన్ కు ఇప్పుడు ప్రవేశపెట్టిన ఛా... ఛా సీక్వెల్ గా భావిస్తున్నారు. అయితే సల్సా స్మార్ట్ మొబైల్ ఫుల్ టచ్ స్ర్కీన్ సామర్థ్యం కలిగి ఉంటే హెచ్ టీ సీ ఛా.. ఛా మాత్రం 2.6 అంగుళాల వైశాల్యం గల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే తో పాటు క్వర్టీ కీ ప్యాడ్ కలిగి ఉంది. ఫేస్ బుక్ బటన్ ఈ మొబైల్ కు ప్రత్యేక ఆకర్షణ కాగా.. మల్టీ మీడియా ఫీచర్స్ మరో అదనం... మ్యూజిక్ ప్లేబాక్, వీడియో ప్లేయర్ లకు సంబంధించి వివిధ ఫైల్ ఫార్మాట్ లలో పని చేసేందుకు ఈ మొబైల్ ఉపకరిస్తుంది.

హెచ్ టీ సీ ఛా..ఛాలో హై డెఫినెషిన్ నాణ్యతతో కూడిన శక్తివంతమైన కెమోరా అనుసంధానించబడింది. ఈ ఆధునిక ఆప్లికేషన్ వల్ల నాణ్యమైన వీడియోలను మన రికార్డు చేసుకోవచ్చు. సూపర్ ఫాస్ట్ 3జీ నెటవర్క్ కు సహకరించే ఈ స్మార్ట్ మొబైల్ కు వీజీఏ ఫ్రంట్ కెమోరా కూడా అమర్చబడి ఉంది. మెమరీ సామర్థ్యాన్ని మైక్రో ఎస్ డీ స్లాట్ ద్వారా 32 జీబీకి పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టం సాఫ్ట్ వేర్ తో పాటు 800 (ఎమ్ హెచ్ జడ్) ప్రాసెస్సర్ తో రూపుదిద్దుకున్న హెచ్ టీ సీ ఛా..ఛా.. బ్లూ టూత్, వై - ఫై, ఎడ్జ్, జీపీఆర్ ఎస్, 3జీ వంటి ఆధునిక సదుపాయాలు కలిగి ఉంది. రూ.15500 ఖీరీదు చేసే ఈ మొబైల్ మార్కెట్లో మంచి పోటీ నిస్తుందని కంపెనీ వర్గాలు ధృడ నిశ్చయంతో ఉన్నాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X