ఒక్క నొక్కు నొక్కితే ఫేస్ బుక్ లోకి..!!

Posted By: Staff

ఒక్క నొక్కు నొక్కితే ఫేస్ బుక్ లోకి..!!

స్మార్ట్‌ఫోన్ ‘హెచ్‌టీసీ ఛా చా’ (HTC ChaCha) కాస్త ఫేస్‌బుక్ ఫోన్‌గా మారిపోయింది. ఈ ఫోన్‌లో పొందుపరిచిన సింగిల్ టచ్ బటన్‌ని ఒక సారి ప్రెస్ చేస్తే చాలు సరాసరి ఫేస్ బుక్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. సోషల్ నెటవర్కింగ్ సైట్లను మరింత చేరువ చేస్తూ మరో బ్రాండ్ ‘ఎల్ జీ జిలాటో’ (LG Gelato) పేరుతో మన్నికైన కమ్యూనికేషన్ మొబైల్‌ను విడుదల చేయునుంది.

‘హెచ్ టీసీ ఛా.. ఛా’లో చోటుచేసుకున్న తాజా పరిణామాల సోషల్ నెట్‌వర్కింగ్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసింది. టచ్‌స్ర్కీన్ సౌలభ్యం గల ‘ఛా..ఛా’ క్వర్టీ కీ ప్యాడ్‌తో ఆకర్షణీయంగా రూపొందించబడింది. ఫేస్‌బుక్‌లో వీడియోలతో పాటు ఫోటోలను అప్‌లోడ్ చేసుకునే విధంగా ఈ ఆప్షన్‌ను తీర్చిదిద్దారు. ఇక ‘ఎల్ జీ గిలాటో’ విషయానికి వస్తే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆండ్రాయిడ్ వ్యవస్థ ఆధారింతంగా ఈ ఫోన్ రూపుదిద్దకుంటున్నట్లు సమాచారం.

5 మెగా పిక్సల్ కెమెరా సామర్ధ్యం కలిగిన హెచ్ టీసీ ఛా.. ఛా, వీజీఏ వ్యవస్థతో కూడిన ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ సౌలభ్యతతో ప్రత్యక్ష వీడియో ఛాటింగ్ చేసుకోవచ్చు. ఇక ‘ఎల్‌జీ గిలాటో’ విషయానికి వస్తే 3.2 మెగా పిక్సల్ కెమెరా, 3x వీడియో జూమ్‌తో పని చేస్తుంది. ఇక వీటి ధరలను పరిశీలిస్తే మార్కెట్లో ఇప్పటికే లభ్యమవుతున్న ‘హెచ్ టీసీ ఛా.. ఛా..’ రూ.14999కి లభిస్తుంది. ఇక ఎల్‌జీ గిలాటోకు సంబంధించి ధరలు వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting