మోస్ట్ వెయిటింగ్ ప్రెండ్లీ స్మార్ట్ ఫోన్‌గా హెచ్‌టిసి డిజైర్

By Super
|
HTC Desire
అనతి కాలంలోనే మొబైల్ ఇండస్ట్రీలో అత్యున్నత శిఖరాలను అందించే సంస్దలలో హెచ్ టిసి మొబైల్స్‌ని పేర్కొనొచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసుకుంటూ తన సేల్స్‌ని నిదానంగా మార్కెట్లో పెంచుకుంటుంది హెచ్ టిసి. ఇటీవల కాలంలో హెచ్ టిసి విడుదల చేసిన హెచ్‌టిసి చాచా మార్కెట్లో మంచి అమ్మకాలను నమోదు చేసింది. సోషల్ నెట్ వర్కింగ్ మానియా ఎక్కవగా ఉన్న రోజుల్ల కేవలం ఒకే ఒక్క టచ్‌తోటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌‌లోకి వెళ్లేలాగా బటన్స్‌ని రూపోందించడం జరిగింది.

హెచ్‌టిసి చాచా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్ ఫోన్. అంతేకాకుండా 600 MHz ప్రాసెసర్‌ని కలిగి ఉండి ఫేస్ బుక్, ట్విట్టర్‌ని చాలా ఫాస్టుగా యాక్సెస్ చేసే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే మార్కెట్లోకి మరో కొత్త ఆండ్రాయిడ్ 2.3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి మొబైల్‌ని విడుదల చేసింది హెచ్‌టిసి కంపెనీ. దానిపేరు హెచ్‌టిసి డిజైర్. హెచ్‌టిసి డిజైర్ 1 GHz ప్రాసెసర్‌ని కలిగి ఉండి, పుల్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే స్మార్ట్ పోన్. దీనితోపాటు మొబైల్ తోపాటు 768 MB RAM రావడం అనేది హెచ్‌టిసి చాచా కంటే మెరుగైన ఫీచర్స్ హెచ్‌టిసి డిజైర్‌లో ఉన్నాయడంలో ఎటువంటి సందేహాం లేదు.

 

రెండు హ్యాండ్ సెట్స్‌ని గనుక గమనించినట్లైతే చాలా ఫీచర్స్ కామన్‌గా ఉన్నాయి. రెండు మొబైల్స్ కూడా ఐడెంటికల్ నెట్ వర్క్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తాయి. రెండు మొబైల్స్ వెనుక భాగాన 5 మెగా ఫిక్సల్ కెమెరా ఉండడం వల్ల చూడచక్కని ఇమేజిలను, వీడియోలను తీయవచ్చు. అంతేకాకుండా వాయిస్, వీడియో రికార్డింగ్ ఫీచర్‌లను సపోర్ట్ చేస్తూ, ఎల్‌ఈడి ఫ్లాష్‌ని కలిగి ఉన్నాయి. ఇక ముందు భాగంలో ఉన్న విజిఎ కెమెరాతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని సపోర్ట్ చేస్తాయి. హెచ్‌టిసి చాచా ఇంటర్నల్‌గా 512 ఎమ్‌బి ROMని కలిగి ఉండగా, అదే హెచ్‌టిసి డిజైర్ కూడా 512 ఎమ్‌బి RAMని కలిగి ఉంది.

 

హెచ్‌టిసి డిజైర్‌లో కావాలంటే RAMని ఎక్పాండ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. మొబైల్స్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మొమొరీ రాగా, అదే మొమొరీని 32జిబీ వరకు ఎక్పాండ్ చేసుకునేటటువంటి వెసులుబాటు కూడా ఉంది. ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పైలను కూడా సపోర్ట్ చేస్తాయి. హెచ్ టిసి డిజైర్‌లో ఉండే మరికొన్ని ఫీచర్స్ ఏమిటంటే జిపిఎస్ నావిగేషన్ అప్లికేషన్స్ అయినటువంటి డాక్యుమెంట్ వివర్, జీమెయిల్, గూగుల్ మ్యాప్ డౌన్ లోడ్ అప్లికేషన్స్, పికాసా ఇంటిగ్రేడెడ్ గూగుల్ సెర్చ్ తోపాటుగా కొత్తదైన వై-పై 8.2.11 బ్యాక్ అప్ కూడా దీని ప్రత్యేకం.

హెచ్ టిసి చాచా‌ని ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. దీని ఖరీదు సుమారుగా రూ 14,999గా నిర్ణయించడం జరిగింది. అదే హెచ్ టిసి డిజైర్ మాత్రం మోస్ట్ వెయిటింగ్ బడ్జెట్ ప్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌గా మార్కెట్లో చరిత్ర సృష్టిస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X