3జీబి ర్యామ్, 13 ఎంపీ కెమెరాతో HTC కొత్త ఫోన్ వచ్చేసింది, రూ.15,990కే

HTC తన కొత్త స్మార్ట్‌ఫోన్ 'Desire 10 Lifestyle' గురువారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.15,990. 3జీ ర్యామ్, 13 మెగా పిక్సల్ కెమెరా, 4G LTE వంటి శక్తివంతమైన ఫీచర్లతో వస్తోన్న ఈ ఫోన్‌లను ప్రముఖ ఈకామర్స్ సైట్ Amazon Indiaతో పాటు HTC e-storeలు సెప్టంబర్ 30 నుంచి విక్రయించనున్నాయి.

3జీబి ర్యామ్, 13 ఎంపీ కెమెరాతో  HTC కొత్త ఫోన్ వచ్చేసింది, రూ.15,990కే

Read More : మీ ఆధార్ కార్డులో తుప్పులున్నాయా..? వాటిని సరిచేసుకోండిలా..?

ప్రత్యేకమైన ఐకానిక్ బూమ్ సౌండ్ స్పీకర్లను ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసారు. 7.7 మిల్లీ మీటర్ల మందంతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ బరువు 155 గ్రాములుగా ఉంది. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన డ్యుయల్ సిమ్ స్లాట్స్ 4G LTE
నెట్2వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి.

3జీబి ర్యామ్, 13 ఎంపీ కెమెరాతో  HTC కొత్త ఫోన్ వచ్చేసింది, రూ.15,990కే

Read More : ఐడియా కొత్త ఆఫర్.. రూ.1కే అన్‌లిమిటెడ్ 4జీ

హెచ్‌టీసీ డిజైర్ లైఫ్‌స్టైల్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే...

5.5 అంగుళాల 720 పిక్సల్ సూపర్ హైడెఫినిషన్ సూపర్ ఎల్2సీడీ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, క్వాల్కమ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎఫ్/2.2అపెర్చుర్, 28 ఎమ్ఎమ్ వైడ్ యాంగ్ ఫోకల్ లెంగ్త్, బీఎస్ఐ సెన్సార్, హెచ్‌డీఆర్ సపోర్ట్, కంటిన్యూస్ షూటింగ్ మోడ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఆటో సెల్ఫీ, వాయిస్ సెల్ఫీ, లైవ్ మేకప్ ఫీచర్,1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ సపోర్ట్), డాల్బీ ఆడియో సపోర్ట్ విత్ డ్యుయల్ మైక్రోఫోన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ సెన్స్ యూజర్ ఇంటర్‌ఫేస్, 2700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ పవర్ సేవింగ్ మోడ్.

English summary
HTC Desire 10 Lifestyle launched in India at Rs 15,990; sale starts September 30. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot