మార్కెట్లోకి రెండు సరికొత్త హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లు
తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ ఇండియన్ మార్కెట్లో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. హెచ్‌టీసీ డిజైర్ 616 (ధర రూ.16,900), హెచ్‌టీసీ వన్ ఇ8 ( ధర రూ.34,900) మోడల్స్‌లో ఈ స్మార్ట్ డివైస్‌లు లభ్యంకానున్నాయి. హెచ్‌టీసీ డిజైర్ 616 మోడల్ వచ్చే వారం నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది. హెచ్‌టీసీ వన్ ఇ8 మోడల్ జూలై ఆఖరు నుంచి మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు పలు ఉపకరణాలను హెచ్‌టీసీ ప్రదర్శించింది.

హెచ్‌టీసీ డిజైర్ 616 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
5 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే, 1.4గిగాహెట్జ్ ఆక్టాకోర్ సీపీయూ (ఆర్మ్ కార్టెక్స్ ఏ7 ఆక్టాకోర్ ఆర్కిటెక్షర్‌తో), 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 5.5 యూజర్ ఇంటర్‌ఫేస్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే బ్లూటూత్ 4.0, వై-ఫై, జీపీఎస్, జీపీఆర్ఎస్, ఎడ్జ్ కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

5 అంగుళాల ఎల్‌సీడీ 3 డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్, 441 పీపీఐ పిక్సల్ డెన్సిటీతో), క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్ 8975ఏసీస్నాప్‌డ్రాగన్ 801క్వాడ్‌కోర్ 2.5గిగాహెట్జ్ క్రెయిట్ 400 సీపీయూ, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 6 యూజర్ ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యూయల్ సిమ్, జీపీఆర్ఎస్, యూఎస్బీ, వై-ఫై, 3జీ, డీఎల్ఎన్ఏ), నాన్ రిమూవబుల్ లైపో 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








