హెచ్‌టీసీ డిజైర్ 620జీ@రూ.15,900

Posted By:

హెచ్‌టీసీ డిజైర్ 620జీ@రూ.15,900

హెచ్‌టీసీ డిజైర్ సిరీస్ నుంచి ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ‘డిజైర్ 620జీ' డ్యూయల్ సిమ్ ఫోన్ ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో ప్రత్యక్షమైంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ ఈ ఫోన్‌ను రూ.15,900 ధర ట్యాగ్‌తో లిస్టింగ్స్‌లో ప్రదర్శించింది. ఈ ఫోన్ కొనుగోలు పై 6జీబి 3జీ డేటాను ఆరు నెలల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చని స్నాప్‌డీల్ సంబంధిత లిస్టింగ్ పేజీలో పేర్కొంది. అయితే, ఈ డేటాను ఆఫర్ చేసే నెట్‌వర్క్ క్యారియర్ గురించి వివరాలను సదరు రిటైలర్ వెల్లడించలేదు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

డిజైర్ 620జీ కీలక స్పెసిఫికేషన్‌లు:

ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ మీడియాటెక్ ఆక్టాకోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
2,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు 4జీ (ఆప్షనల్ కావొచ్చు), 3జీ, వై-ఫై, బ్లూటూత్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
HTC Desire 620G dual-SIM smartphone listed online, priced at Rs 15,900. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot