మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014లో హెచ్‌టీసీ కొత్త ఆవిష్క్రరణలు
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014, సోమవారం జరిగిన మొదటి రోజు ప్రదర్శనలో భాగంగా తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ.. డిసైర్ 810, డిసైర్ 610 మోడల్స్‌లో రెండు మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ మొబైలింగ్ పరికరాలు 4జీ కనెక్టువిటీ సామర్థ్యాలను పొందుపరిచారు. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

హెచ్‌టీసీ డిసైర్ 816
ఫోన్ పరిమాణం 156.6 x 78.7 x 7.99 మిల్లీమీటర్లు, బరువు 165 గ్రాములు. 5.5 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1.6గిగాహెట్జ్ క్వాడ్-కోర్ సీపీయూ, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1.5జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (జీఎస్ఎమ్,జీపీఆర్ఎస్, ఎడ్జ్, డబ్ల్యూసీడీఎమ్ఏ, హెచ్ఎస్ పీఏ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ), వై-ఫై డైరెక్ట్, 2,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఈ మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ నుంచి మార్కెట్లోకి రానుంది. అందుబాటులో ఉండే కలర్ వేరియంట్స్ బ్లాక్, వైట్, ఆరెంజ్, మైల్డ్ గ్రీన్, డార్క్ బ్లూ, గ్రే.
హెచ్‌టీసీ డిసైర్ 610

4.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 2,040 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications