విపణిలోని హెచ్‌టీసీ డిజైర్ 816
తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ తన డిజైర్ సిరీస్ నుంచి ‘డిజైర్ 816' పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్‌ను ఏప్రిల్ 21న మార్కెట్లో ఆవిష్కరించినప్పటికి నిన్నటి వరకు మార్కెట్ విడుదలకు నోచుకోలేదు. అయితే, ఎట్టకేలకు ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ రిటైలర్ ఇన్ఫీబీమ్ ( Infibeam) ఈ డివైస్‌ను రూ.24,450కి విక్రయిస్తోంది. హెచ్‌టీసీ డిజైర్ 816 కీలక ఫీచర్లను పరిశీలించినట్లియితే...

5.5 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,
క్వాడ్‌కోర్ 1.6గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
1.5జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
హెచ్‌టీసీ సెన్స్ 5.5 యూజర్ ఇంటర్ ఫేస్,
13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, జీపీఎస్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








