కేకపుట్టించే హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ పై టాప్-3 ఆన్‌లైన్ డీల్స్!

Posted By: Prashanth

కేకపుట్టించే హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ పై టాప్-3 ఆన్‌లైన్ డీల్స్!

 

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ హెచ్‌టీసీ ఇటీవల సింగపూర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆండ్రాయిడ్ అలాగే విండోస్ ఆధారితంగా స్పందించే నాలుగు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వీటిలో ఒకటైన డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఐసీఎస్ ఫోన్ ‘హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వీ’దేశీయ మార్కెట్లో రూ.22,590 ధరకు లభ్యమవుతోంది. ఈ డివైజ్ కొనుగోలు పై పలువురు ఆన్‌లైన్ రిటైలర్లు హాట్‌డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. వాటిలో టాప్-3.......

స్నాప్‌డీల్: ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ డాట్‌కామ్ ‘హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వీ’ని రూ.21,999కి ఆఫర్ చేస్తోంది. క్యాష్ ఆన్ డెలివరీ, 3 నుంచి 6 వాయిదాలలో నెలవారి చెల్లింపులను సైతం ఈ రిటైలర్ స్వాగతిస్తుంది.

ఇన్ఫీబీమ్: ఈ ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ‘డిజైర్ ఎస్‌వీ’ని రూ.21,649కి ఆఫర్ చేస్తోంది. బుక్ చేసుకున్న 24 గంటల్లో ఫోన్‌ను డెలివరీ చేస్తారు.

సాహోలిక్: సాహోలిక్ డాట్ కామ్ డిజైర్ ఎస్‌వీని రూ.21,799కి విక్రయిస్తోంది. ఈ రిటైలర్ ద్వారా నెలవారి చెల్లింపులతో డిజైర్ ఎస్‌విని కొనుగోలు చేసుకోవచ్చు.

హెచ్‌టీసీ డిజైర్ ఎస్‌వి కీలక స్పెసిఫికేషన్‌లు:

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 4.3 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 డిస్‌ప్లే, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 చిప్‌సెట్, డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ క్రెయిట్ ప్రాసెసర్, 768ఎంబి ర్యామ్, 8 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్, ఎఫ్2.2 ఆపెర్చర్, 28ఎంఎం లెన్స్), 4జీబి ఆన్-బోర్డ్ స్టోరేజ్, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, మైక్రోయూఎస్బీ 2.0, బ్లూటూత్ 4.0, జీపీఎస్, వై-ఫై, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, 1620ఎమ్ఏహెచ్ బ్యాటరీ, గూగుల్ ప్లే స్టోర్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot