హైక్వాలిటీ మల్టీ మీడియా ఫీచర్స్‌తో హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్!

Posted By: Prashanth

హైక్వాలిటీ మల్టీ మీడియా ఫీచర్స్‌తో హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్!

 

తైవాన్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హెచ్‌టీసీ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ ‘డిజైర్ ఎక్స్’ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.19,799. ఈ ఫోన్‌ను తొలత ఐఎఫ్ఏ 2012 బెర్లిన్ ఎక్స్‌పోలో ఆవిష్కరించారు. వేగవంతంగా స్పందించే డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను ఈ డివైజ్‌లో వినియోగించారు. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఈ-బే ఇండియా హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్ వివరాలను నాలుగు రోజుల క్రిందటే తన లిస్టింగ్స్‌లో పెట్టింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా హెచ్‌టీసీ ఇండియా కంట్రీ మేనేజర్ ఫియాసల్ సిద్దిఖి మాట్లూడుతూ హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్ సామాజిక సంబంధాలను మరింత పటిష్టం చేస్తుందని అన్నారు. హై క్వాలిటీ మల్టీ మీడియా ఫీచర్స్, వేగవంతమైన ప్రాసెసింగ్, ఉన్నత శ్రేణి మొబైలింగ్ అనుభూతులను ఈ స్మార్ట్‌ఫోన్, యూజర్‌కు చేరవచేస్తుందని సిద్దిఖి ధీమా వ్యక్తం చేశారు. వీడియో, ఫొటోలు ఒకేసారి తీసుకునే వీలున్న వీడియోపిక్ ఫీచర్‌ను ఈ ఫోన్‌లో కల్పించారు.

హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్ కీలక స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల ఎస్-ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్ 4 ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 786ఎంబీ ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 25జీబి డ్రాప్ బాక్స్ క్లౌడ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, బీట్స్ ఆడియో టెక్నాలజీ, 3జీ కనెక్టువిటీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, డీఎల్ఎన్ఏ, బ్లూటూత్ 4.0, 1650ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (10గంటల టాక్‌టైమ్, 750 గంటల స్టాండ్‌బై).

హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్‌కు పోటీదారుగా అభివర్ణిస్తున్న గెలాక్సీ ఎస్3 మినీ ఫీచర్లు:

సామ్‌సంగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘గెలాక్సీ ఎస్3 మినీ’ని గురువారం జర్మనీలో ఆవిష్కరించారు. ఆపిల్ ఐప్యాడ్ మీనీకి పోటీగా డిజైన్ కాబడిన ఈ 4 అంగుళాల సొగసరి స్మార్ట్‌ఫోన్ స్టన్నింగ్ లుక్‌తో చూపరులను అలరిస్తోంది. క్రిస్టమస్ నాటికి ఈ ఫోన్ మార్కెట్లో లభ్యమవుతుంది. వివిధ మెమరీ వేరియంట్‌లలో ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ లభ్యంకానుంది.

కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడిఫ్లాష్ సౌలభ్యతతో ), వీజీఏ ఫ్రంట్ పేసింగ్ కెమెరా, 4 అంగుళాల ఆమోల్డ్ స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot