మెగా ఫ్యామిలీకి మరో పోటి!

Posted By: Super

 మెగా ఫ్యామిలీకి మరో పోటి!

 

ఆపిల్ నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్న సామ్‌సంగ్ రానున్న రోజుల్లో హెచ్‌టీసీ నుంచి పోటీని ఎదుర్కొనుంది. మంగళవారం న్యూయార్క్ నగరంలో ప్రముఖ టెలికం ఆపరేటర్ వెరిజాన్‌(Verizon)తో కలిసి ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తైవాన్ స్మార్ట్‌ఫోన్ మేకర్ హెచ్‌టీసీ తన సరికొత్త 5 అంగుళాల ఫాబ్లెట్‌ను ప్రకటించింది. పేరు డ్రాయిడ్ డీఎన్ఏ ( DROID DNA).డివైజ్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే..... ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 4+ యూజర్ ఇంటర్‌ఫేస్,

5 అంగుళాల 1080పిక్సల్ హైడెఫినిషన్ సూపర్ ఎల్‌సీడీ3 డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, 1.5గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2గిగాబైట్స్ ర్యామ్, 16జీబి ఆన్‌బోర్ట్ స్టోరేజ్, బీట్స్ ఆడియో టెక్నాలజీ,  2020ఎమ్ఏహెచ్ బ్యాటరీ, మైక్రోయూఎస్బీ 2.0,  802.11 వై-ఫై ఏ/బి/జి/ఎన్,  ఎన్ఎఫ్‌సీ రేడియో, గూగుల్ సర్వీసెస్,  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(వైడ్-యాంగిల్ లెన్స్, 5 లెవల్ ఆటోమెటిక్ ఫ్లాష్, బ్యాక్‌సైడ్ ఇల్యూమినేటెడ్ సెన్సార్), 2.1మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1080పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్. యూఎస్ మార్కెట్లో ఈ ఫోన్‌ను వెరిజాన్ విక్రయిచనుంది. ఇందుకు సంబంధించి ప్రీఆర్డర్లు ప్రారంభించినట్లు సమాచారం. ధర $199 (రూ.11,000) రెండు సంవత్సరాల ఒప్పందంతో.  హెచ్‌టీసీ డ్రాయిడ్ డీఎన్ఏ వెరిజాన్ వర్షన్ వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది.

హెచ్‌టీసీ డ్రాయిడ్ డీఎన్ఏ నుంచి పోటీని ఎదుర్కొనున్న సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 2 ఫీచర్లు!

5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ హైడెఫినిష్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెర్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, మెరుగైన టచ్ అనుభూతులను చేరువ చేసే స్టైలస్ ఎస్-పెన్ సపోర్ట్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ 16జీబి, 32జీబి, 64జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత, 8 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3,100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.39,990. ఈ రెండు ఫాబ్లెట్‌ల స్పెసిఫికేషన్‌లను అంచనావేస్తే గెలాక్సీ నోట్ 2లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎస్-పెన్ డిజిటైజర్ హెచ్‌టీసీ డ్రాయిడ్ డీఎన్ఏ‌లో లోపించింది.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot