లైన్లో రెబల్ స్టార్!

Posted By: Prashanth

లైన్లో రెబల్ స్టార్!

 

స్టైలిష్ బ్రాండ్ హెచ్‌టీసీ నుంచి మరో రెబల్ స్టార్ రాబోతుంది. హెచ్‌టీసీ ‘ఇవైటా’గా రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆధారితంగా పని చేస్తుంది. 129 గ్రాముల బరువుతో తయారుకాబడిన ఈ డివైజ్ లో 4.7 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎమ్ఎస్ఎమ్8960 ప్రాసెసర్, 1500 మెగాహెడ్జ్ ప్రాసెసింగ్ వేగాన్ని కలిగి ఉంటుంది. 1 జీబి ర్యామ్, 14.9జీబి రోమ్ వంటి అంశాలు హ్యాండ్‌సెట్ ఇంటర్నల్ స్టోరేజ్‌ను బలోపేతం చేస్తాయి.

గ్యాడ్జెట్ 3జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. వై-ఫై వ్యవస్థ వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు ఉపకరిస్తుంది. బ్లూటూత్ 4.0, యూఎస్బీ 2.0 ఫీచర్ల సాయంతో డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఉత్తమ క్వాలిటీ వినోదాలను చేరువ చేసే క్వాలిటీ ఆడియో, వీడియో ప్లేయర్లను ఫోన్‌లో పొందుపరిచారు. వెనుక భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. ముందుభాగంలో అమర్చిన 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా క్వాలిటీతో కూడిన ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు తోడ్పడుతుంది.

హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన హెచ్‌టీసీ సెన్స్ 4.0 యూజర్ ఇంటర్‌ఫేస్, హెచ్‌టీసీ బీట్స్ ఆడియో, డిజిటల్ కంపాస్, డీఎల్‌ఎన్ఏ, ఎన్ఎఫ్‌సీ వంటి అంశాలు యూజర్‌కు మరింత ఉపయోగపడతాయి. 100/50Mbps సామర్ధ్యం గల ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను హెచ్‌టీసీ ఇవైటా సపోర్ట్ చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot