పాఠకుల కోసం ప్రత్యేకం, హెచ్‌టిసి ఇవో డిజైన్ 4జీ స్మార్ట్‌ఫోన్

Posted By: Staff

పాఠకుల కోసం ప్రత్యేకం, హెచ్‌టిసి ఇవో డిజైన్ 4జీ స్మార్ట్‌ఫోన్

ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఇప్పటికే హెచ్‌టిసి విడుదల చేసే ఉత్పత్తులకు మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న సంగతి తెలిసిందే. ఆ బ్రాండ్ వాల్యూని నిలబెట్టుకునే మార్గంలో హెచ్‌టిసి మార్కెట్లోకి కొత్తగా ఓ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేస్తుంది. దాని పేరు 'హెచ్‌టిసి ఇవో డిజైన్ 4జీ'. ఈ మొబైల్ 4 ఇంచ్ డిస్ ప్లేతో పాటు 540 x 960 ఫిక్సల్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. దీని బరువు 147 గ్రాములు. కెపాసిటివ్ టచ్ స్క్రీన్ టెక్నాలజీతో మార్కెట్లోకి విడుదలవుతున్న ఈ మొబైల్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో తప్పని సరిగా సక్సెస్ అవుతుందని హెచ్‌టిసి నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

హెచ్‌టిసి ఇవో డిజైన్ 4జీ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 2.3.3 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇందులో 1200 MHz కలిగిన సింగిల్ కోర్ క్వాలికామ్ ఎమ్ఎస్‌ఎమ్ 8655 ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. 768 MB RAM దీని సొంతం. మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలతో పాటు 720p ఫార్మెట్లో హై డెఫినేషన్ వీడియో రికార్డింగ్‌ని తీయవచ్చు.

మొబైల్ ముందు భాగంలో ఉన్న 1.3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొనిరావచ్చు. కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే ఆటోఫోకస్ ప్రత్యేకం. మల్టీమీడియా ఫీచర్స్‌తో పాటుగా, ఆడియో, వీడియో ఫ్లే బ్యాక్ ఈ మొబైల్ ప్రత్యేకత. హెచ్‌టిసి ఇవో డిజైన్ 4జీ స్మార్ట్ ఫోన్ ముఖ్యమైన ఫీచర్స్‌లలో చెప్పుకోదగ్గది జిపిఎస్ నావిగేషన్ టెక్నాలజీ. మేసేజింగ్ ఫెసిలిటీల విషయానికి వస్తే SMS, MMS, E-mail మొదలగునవి ఈ మొబైల్‌లో అందుబాటులో ఉన్నాయి.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పై లను సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ బ్యాక్ అప్ విషయానికి వస్తే ఇందులో 1520 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. 6 గంటలు టాక్ టైమ్‌ని అందిస్తుంది. హెచ్‌టిసి ఇవో డిజైన్ 4జీ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ధరను ఇంకా మార్కెట్లో వెల్లడించ లేదు. త్వరలో మరిన్ని ప్రత్యేకతలను వన్ ఇండియా పాఠకులకు తెలియజేయడం జరుగుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot