బిగ్‌ఫైట్ మొదలైంది..?

Posted By: Staff

బిగ్‌ఫైట్ మొదలైంది..?

 

చిరకాల ప్రత్యుర్ధులైన గుగూల్, ఫేస్‌బుక్‌లు మరో మారు వార్తల్లో నిలిచాయి. ఈ సారి తమ బలప్రదర్శనకు వేదికగా స్మార్ట్‌ఫోన్ సెక్టార్‌ను ఎంచుకున్నాయి. ఈ క్రమంలో గుగూల్, సామ్‌సంగ్‌తో జతకట్టగా... హెచ్‌టీసీ

ఫేస్‌బుక్‌తో జతకట్టింది. గుగూల్, సామ్‌సంగ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న స్మార్ట్‌ఫోన్ పేరు ‘నెక్సస్’, అలాగే  హెచ్‌టీసీ, ఫేస్‌బుక్‌ల సంయుక్త సారధ్యంలో డిజైన్ కాబడుతున్న ఫోన్ ‘హెచ్‌టీసీ

ఫేస్‌బుక్’.

ఫేస్‌బుక్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడుతున్నఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ సోషల్ నెట్‌వర్కింగ్‌కు పూర్తి స్థాయి అనువుగా ఉంటుంది.  ఈ ఏడాదిలోనే డివైజ్ అందుబాటులోకి రానుంది. కాగా, Salsa, ChaCha మోడళ్లలో ఇప్పటికే రెండు  ఫేస్‌బుక్ స్మార్ట్‌ఫోన్‌లను హెచ్‌టీసీ విడుదల చేసింది. తొలత, గుగూల్,  హెచ్‌టీసీ సంయుక్త భాగస్వామ్యంలో  మొదటి జనరేషన్ నెక్సస్ ఫోన్ విడుదలయ్యింది.  మారిన సమీకరణల నేపధ్యంలో హెచ్‌టీసీతో ఒప్పందాన్ని రద్దచేసుకున్న గుగూల్ సామ్‌సంగ్‌తో జతకట్టింది.

క్వర్టీకి బై..బై!!

క్వర్టీ హార్డ్‌వేర్ ఫోన్ల తయారీని నిలుపుదల చేస్తున్నట్లు హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ హెచ్‌టీసీ సంచలన ప్రకటన చేసిందని విశ్వసనీయ వర్గాలు ఉటంకించాయి. సియాటిల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కంపెనీ డిజైన్ టీమ్ భవిష్యత ప్రణాళికలో భాగంగా ఈ వివరాలను వెల్లడించినట్లు సమాచారం. క్వర్టీ హార్డ్‌వేర్ వ్యవస్థతో పనిచేసే పలు ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లను హెచ్‌‌టీసీ డిజైన్ చేసింది. మార్కెట్లో ఆశాజనకమైన ఫలితాలు రాకపోవటంతో ఈ డిజైన్ ప్లాన్ నుంచి విరమించుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. హెచ్‌టీసీ తీసుకున్న నిర్ణయం ఏలా ఉన్నప్పటికి, ఈ చర్య పట్ల అభిమానులు ఆసంతృప్తికి లోనవుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot