‘4జీ’ డేటా‌స్పీడ్ సెకనుకు ఎంత..?

Posted By: Prashanth

‘4జీ’ డేటా‌స్పీడ్ సెకనుకు ఎంత..?

 

కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత వేగవంతం చేస్తూ ఆవిర్భవించిన ‘4జీ’ నెట్‌వర్క్ దాటికి ‘3జీ’ విప్లవం చప్పబడుతోంది. 4జీ నెట్‌వర్క్ డేటా‌స్పీడ్ సామర్యం హై మొబిలిటీ కమ్యూనికేషన్ వాతావరణంలో సెకనుకు 100MBగా, ‘లో మొబిలిటీ కమ్యూనికేషన్ వాతావరణంలో సెకనుకు 1 జీబిగా ఉంది. ఈ నేపధ్యంలో అందిరి దృష్టి 4జీ వ్యవస్థను సపోర్ట్ చేసే గ్యాడ్జెట్ల పైనే పడింది.

ప్రముఖ మొబైల్ ఉత్పత్తిదారు హెచ్‌టీసీ (HTC) 4జీ వ్యవస్థను సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్‌ను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హెచ్‌టీసీ ఫైర్‌బాల్ మోడల్‌లో డిజైన్ కాబడుతున్న ఈ ఫోన్ డిసెంబర్ చివరి వారంలో విడుదల కాబోతున్న ‘మోటరోలా డ్రాయిడ్ 4’కు తీవ్రమైన పొటీదారుగా నిలవనుందన్న వార్తలు గుప్పుముంటున్నాయి.

ఫైర్‌బాల్ ఫీచర్లు హెచ్‌టీసీ మునుపటి వర్షన్‌లైన ‘తండర్ బోల్ట్ ADR 6400’, ‘రీజౌండ్ ADR6425’ ఫోన్ల ఫీచర్లుకు దగ్గరగా ఉండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. శక్తివంతమైన ప్రాసెసర్ అదే విధంగా పటిష్టమైన ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌ను ఫైర్‌బాల్‌లో నిక్షిప్తం చేసినట్లు వినికిడి. మోటరోలా వంటి ధీటైన దిగ్గజాలను ఎదుర్కొవాలన్న కుతూహలంతో హెచ్‌టీసీ చేస్తున్న ప్రయోగం సఫలీకృతం కావాలని కోరుకుందాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot