ఆ పుకారు నిజమేనా..?

Posted By: Prashanth

ఆ పుకారు నిజమేనా..?

 

స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని ఓ పుకారు ఊరిస్తుంది. మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ హెచ్‌టీసీ, చవక ధరకే ఓ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెడుతందంటూ వార్తాలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. హెచ్‌టీసీ గోల్ఫ్ (హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ సీ) ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది. ఏర్పాటు చేసిన జంట కెమెరా వ్యవస్థ ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీ అనుభూతులను పంచుతుంది. నిక్షిప్తం చేసిన మరిన్ని యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు వినియగాదారు మొబైలింగ్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తాయి. ఇతర హ్యాండ్‌సెట్‌లతో పోలిస్తే ‘వైల్డ్‌ఫైర్’పనితీరులో భేష్.....

ఫీచర్లు:

- ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (4.0 యూజర్ ఇంటర్ ఫేస్) ,

- సింగిల్ కోర్ ప్రాసెసర్,

- 3.5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480X320 పిక్సల్స్),

- 512 ఎంబీ ర్యామ్,

- 4జీబి ఇంటర్నల్ మెమరీ,

- 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

- ఫ్రంట్ కెమెరా (వీడియో ఛాటింగ్ కోసం),

- బీట్స్ ఆడియో టెక్నాలజీ,

- బ్లూటూత్,

- వై-ఫై కనెక్టువిటీ,

ఈ స్పెసిఫికేషన్‌లతో పాటు అదనంగా డ్రాప్‌బాక్స్ క్లౌడ్ స్టోరేజ్‌ను స్మార్ట్ ఫోన్‌లో ఉచితంగా పొందవచ్చు. వాలిడిటీ 2 సంవత్సరాలు, స్టోరేజి లిమిట్ 25జీబి వరకు. ధర ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot