మీకు ‘ది బెస్ట్ ఫ్రెండ్’ కావాలనుకుంటున్నాను!

Posted By: Super

మీకు ‘ది బెస్ట్ ఫ్రెండ్’ కావాలనుకుంటున్నాను!

 

సాంకేతికత మరింత విస్తరిస్తున్న నేపధ్యంలో స్మార్ట్ ఫోన్ సెగ్మంట్‌లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రఖ్యాత మొబైల్ నిర్మాణ సంస్థ హెచ్‌టీసీ అత్యత్తమ స్సెసిఫికేషన్‌లతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది.

‘హెచ్‌టీసీ గోల్ప్’గా డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్  ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై రన్ అవుతుంది. ఆధునిక ఫీచర్లతో విస్తారమైన కలర్ వేరియంట్ లలో గోల్ఫ్ లభ్యం కానుంది. ఏప్రిల్ లేదా జూన్ నాటికి ఈ స్మార్ట్ ఫోన్ ను అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు.  సమంజసమైన ధరకే లభ్యంకానున్న హెచ్‌టీసీ గోల్ప్  వినియోగదారుని మొబైలింగ్ అదేవిధంగా కంప్యూటింగ్ అవసరాలను  పూర్తి స్థాయిలో తీరుస్తుంది.

ఫోన్ ఫీచర్లు (అంచనా):

*  శక్తివంతమైన 1 జిగాహెడ్జ్ ప్రాసెసర్,

*  3.5 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 480*800 పిక్సల్స్),

*  512ఎంబీ ర్యామ్,

*  4జీబి ఆన్-బోర్డ్ స్టోరేజ్,

*  32జీబి ఎక్సప్యాండబుల్ మెమరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot