హెచ్‌టీసీ జంట వార్తల సమాహారం!!

మునుపెన్నడూ చూడని విశిష్ట అంశాలు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఒదిగి ఉన్నాయి. తేలికైన బరువు... హుందా లుక్.. సలువైన ఆపరేటింగ్ విధానలు ఎవరినైనా కట్టిపడేస్తాయి. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పనిచేసే ఈ హ్యండ్‌సెట్ పేరు ‘హెచ్‌టీసీ హెచ్‌డి 7’. ఇవే తరహా ఫీచర్లు కలిగిన ఇతర ఫోన్‌లతో పోలిస్తే ‘హెచ్ డి7’ ధర తక్కువే.
ఫోన్‌లో నిక్షిప్తం చేసిన పలు ఉత్తమ ఫీచర్లు:
• 320 గంటల స్టాండ్‌బైతో పాటు 6 గంటలు అంతరాయం లేని టాక్‌టైమ్ నిచ్చే శక్తివంతమైన లయోన్ బ్యాటరీని ఫోన్‌లో నిక్షిప్తం చేశారు.
• తక్కువ బరువు, సౌకర్యవంతమైన పనితీరు,
• ఎల్‌సీడి టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
• 5 మెగా పిక్సల్ ఉత్తమ క్వాలిటీ కెమెరా (వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో),
• బ్లూటూత్, వై-పై, యూఎస్బీ, జీపీఎస్, ఎడ్జ్ కనెక్టువిటీ,
• ఆధునిక మల్టీ మీడియా ఫీచర్లు,
• 16జీబి ఇంటర్నల్ మెమెరీ,
• విండోస్ పోన్ 7 ఆపరేటింగ్ సిస్టం,
ఇండియన్ మార్కెట్లో ఈస్మార్ట్‌ఫోన్ ఖచ్చితమైన ధర రూ.18,000. ప్రొఫెషనల్ హోదాను కోరుకునే వారికి ఈ ఫోన్ ఉత్తమ ఛాయిస్.
హెచ్‌టీసీ వారి మరో డ్యూయల్ సిమ్ ఫోన్ ఆండ్రాయిడ్ 4.0 ఐసీహెచ్ (HTC T328W) ఫీచర్లు:
సరికొత్త డ్యూయల్ సిమ్‌ఫోన్ హెచ్‌టీసీ విండ్ ఇటీవల చైనా మార్కెట్లో విడుదలై అక్కడి మీడియా ద్ళష్టిని ఆకర్షించింది. ఉపయుక్తమైన అంశాలు ఈ ఫోన్‌లో ఒదిగి ఉండటంతో అక్కడ వినియోగదారలు నుంచి పెద్ద ఎత్తున స్పందన లిభిస్తోంది. హెచ్‌టీసీ టీ328డబ్ల్యూ (HTC T328W)గా రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ఫోన్ అత్యాధునిక ఆండ్రాయిడ్ వోఎస్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై రన్ అవుతుంది.
హ్యాండ్‌సెట్ ముఖ్య ఫీచర్లు:
- డ్యూయల్ సిమ్ సపోర్ట్,
- సూపర్ ఎల్‌సీడీ టెక్నాలజీతో కూడిన 4 అంగుళాల స్ర్కీన్ (పిక్సల్ రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్) ,
- 5 మెగా పిక్సల్ కెమెరా,
- ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
- 1 జిగాహెడ్జ్ సామర్ధ్యం కలిగిన సింగిల్ కోర్ ప్రాసెసర్,
- గుగూల్ సెన్స్ 4.0 యూజర్ ఇంటర్‌ఫేస్,
- 512 ఎంబీ ర్యామ్,
- 4జీబి ఇంటర్నల్ మెమెరీ,
- సమర్ధవంతమైన మూడు టచ్ సెన్సిటివ్ బటన్స్,
- సుదీర్ఘ బ్యాకప్ నిచ్చే 1650mAhబ్యాటరీ,
- ధర రూ.16,000.


Click it and Unblock the Notifications