హెచ్‌టీసీ హెడీ2 స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ జెల్లీబీన్!

By Super
|
HTC HD2 smartphone now updated with Android Jelly Bean

స్టైలిష్ బ్రాండ్ హెచ్‌టీసీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్ ‘హెచ్‌డి2’. హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో అగ్రశ్రేణి హ్యాండ్‌సెట్‌గా గుర్తింపుతెచ్చుకున్న ఈ డివైజ్ త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అప్‌డేట్‌ను అందుకోనుంది. ఆండ్రాయిడ్ నుంచి కొత్త వర్షన్‌గా విడుదలవుతున్న జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టంను నెక్సస్ టాబ్లెట్‌లలో పొందుపరిచిన విషయం తెలిసిందే. ఈ తాజా అప్‌డేట్‌తో ఫోన్ మల్టీటచ్ వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. గెస్ట్యర్ కంట్రోల్ అదేవిధంగా నావిగేషన్ ఆప్షన్‌లు సమర్ధంతంగా పనిచేస్తాయి. గ్రాఫికల్ రిప్రెజంటేషన్, వాయిస్ సెర్చ్ వంటి యూజర్ ఫ్రెండ్లీ ఆప్షన్‌లు అదనంగా చేరతాయి.

హెచ్‌టీసీ హెచ్‌డి2 కీలక ఫీచర్లు:

4.3 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్,

ఫోన్ బరువు 157 గ్రాములు,

448 ఎంబీ ర్యామ్,

512ఎంబీ రోమ్,

మైక్రోఎస్ డి స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,

5మెగా పిక్సల్ రేర్ కెమెరా (రిసల్యూషన్ 2592 x 1944పిక్సల్స్),

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

క్వాల్కమ్ క్యూఎస్ డి8250 స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్,

1గిగాహెట్జ్ స్కార్పియన్ సీపీయూ,

అడ్రినో 200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

వై-ఫై,

బ్లూటూత్ వీ2.1,

మైక్రోయూఎస్బీ సపోర్ట్,

స్టాండర్డ్ Li-Ion 1230 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (స్టాండ్‌బై టైమ్ 390 గంటలు, టాక్‌టైమ్ 5గంటల40 నిమిషాలు).

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X