అబ్బా!!! ఎంత ముద్దొస్తుంది గురు!

Posted By: Staff

అబ్బా!!! ఎంత ముద్దొస్తుంది గురు!

 

 

స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ మేకర్ హెచ్‌టీసీ పూర్తి స్థాయి హైడెఫినిషన్ డిస్‌ప్లే‌తో కూడిన  సరికొత్త ‘జే బటర్‌ఫ్లై’(J Butterfly) స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం జపాన్‌లో ఆవిష్కరించింది. డిసెంబర్ నుంచి ఈ ఫోన్‌లను జపాన్‌లో మాత్రమే విక్రయించనున్నారు. గ్లోబల్ రిలీజ్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఫీచర్లు:

5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 3 డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్), 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ ఎస్4 ప్రో క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 8మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 4+ యూజర్ ఇంటర్ ఫేస్, 2020ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు: హెచ్‌డిఎమ్ఐ అవుట్, మైక్రోయూఎస్బీ, ఇన్‌ఫ్రారెడ్, వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్.

మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ వన్‌ఎక్స్+ ఫీచర్లు:

ఫోన్ బరువు 135 గ్రాములు, చుట్టు కొలత 134.36 x 69.9 x 8.9మిల్లీమీటర్లు, 4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా3 ఏపీ37 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 1జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

2100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (6 గంటల టాక్ టైమ్).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot