‘హెచ్‌టీసీ ఎమ్7’... త్వరలో

Posted By: Prashanth

‘హెచ్‌టీసీ ఎమ్7’... త్వరలో

 

తైవాన్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హెచ్‌టీసీ తన కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ ఎమ్7ను ఫిబ్రవరిలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించేందుకు సన్నహాలు చేస్తుంది. 1080 పిక్సల్ డిస్‌ప్లే రిసల్యూషన్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 4.7 అంగుళాల స్ర్కీన్ తో రూపుదిద్దుకుంది. మార్కెట్లో లభ్యమవుతన్న ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే ఈ ఫోన్ రిసల్యూషన్ 40 శాతం అధికం. హ్యాండ్‌సెట్ ముందుభాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ రిసల్యూషన్) వినియోగదారులకు మన్నికైన వీడియో రికార్డింగ్‌ను అందిస్తుంది. ఫోన్‌లో వినియోగించిన 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ కెమెరా, ఎల్‌టీఈ చిప్స్, బీట్స్ ఆడియా టెక్నాలజీ, కొత్త జనరేషన్ వై-ఫై స్టాండర్డ్స్, 1.7గిగిహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌లు కొత్త తరహా మొబైలింగ్ అనుభూతులకు లోను చేస్తాయి.

డ్యూయల్‌సిమ్ కెమెరా ఫోన్‌లు (రూ.3,000 ధరల్లో)

విడుదలకు సిద్ధంగా ‘హెచ్‌టీసీ బటర్ ఫ్లై’......

స్టైలిష్ బ్రాండ్ హెచ్‌టీసీ తన గ్లోబల్ వేరియంట్ ఫోన్ ‘బటర్ ఫ్లై’ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఫోన్ స్ర్కీన్ పరిమాణం 5 అంగుళాల ఎల్‌సీడీ 3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2, 1.5గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రో ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 4 యూజర్ ఇంటర్ ఫేస్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, హెచ్‌డిఎమ్ఐ అవుట్, మైక్రోయూఎస్బీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ), 2020ఎమ్ఏహెచ్ బ్యాటరీ.ఇండియన్ మార్కెట్లో హెచ్‌టీసీ బటర్ ఫ్లై అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఫోన్ నీటిలో తడిచిందా..?

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot