హెచ్ టీసీ మజా మార్కెట్లో రుచించేనా..!!

Posted By: Staff

హెచ్ టీసీ మజా మార్కెట్లో రుచించేనా..!!

మొబైల్ సెక్టార్లో తనకంటూ ప్రత్యేక క్రేజును సంపాదించుకున్న హెచ్‌టీసీ (HTC) సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. వివిధ ఫీచర్లతో రూపుదిద్దుకున్న హెచ్‌టీసీ మజా ( HTC Mazaa ) వినియోగదారులను ఖచ్చితంగా సంతృప్తి పరుస్తుందట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు విడుదల కాబోతున్న ఈ స్మార్ట్ హ్యాండ్ సెట్ CDMA/GSM వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు ఇతర హెచ్‌టీసీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఇక ఇతర అంశాలను పరిశీలిస్తే ‘మజా’ 3.8 అంగుళాల టీఎఫ్టీ (TFT) సామర్ధ్యం కలిగిన టచ్ స్ర్కీన్ స్వభావం కలిగి ఉంది. ఆకర్షణీయంగా రూపుదిద్దకున్న ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే 480 x 800 రిసల్యూషన్ కలిగి ఉంటుంది. మల్టీ టచ్ స్వభావం కలిగిన ఈ స్మార్ట్ ఫోన్‌లో పిక్చర్‌ను రోటోటే చేసేకోవటంతో పాటు జూమ్ ఇన్, జూమ్ అవుట్‌లో చూడొచ్చు.

జీఎస్ఎమ్ (GSM), సడీఎమ్ఏ (CDMA) వ్యవస్థలను హెచ్‌టీసీ మజా సపోర్టు చేస్తుంది. అనుసంధానించబడిన 5 మోగా పిక్సల్ కెమెరా అత్యుత్తమ నాణ్యతతో కూడి ఫోటోలను మీకు అందిస్తుంది. అంతేకాదు.. అదనంగా పొందుపరిచిన ఎల్ఇడీ ( LED) ఫ్లాష్ నాణ్యమైన వీడియో రికార్డింగ్‌ను మీకు అందిస్తుంది.

ఇక కనెక్ట్‌విటీ విషయంలో ‘మజా’ తయారీదారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో పొందుపరిచిన 2.1 బ్లూటూత్ వ్యవస్థ డేటా ట్రాన్స్‌ఫర్‌ను వేగవంతంగా చేస్తుంది. ఈ స్మార్ట్ పీస్ లో పొందుపరిచిన వై - ఫై వెసలుబాటు ద్వారా సినిమాలను సైతం, ఇతర డివైజుల్లోకి వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అనుసుంధానించిన USB ద్వారా మీ మొబైల్ నుంచి ఇతర ల్యాప్ టాప్‌లకు డేటాను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

ఇక ఎంటర్‌టైన్‌మెంట్ విషయానికి వస్తే ‘మజా’లో పొందుపరిచిన మ్యూజిక్ ప్లేయర్ MP3, WMA, M4A తదితర M4B ఫైళ్లను సపోర్టు చేస్తుంది. గేమింగ్‌లోనూ అధునాతన సాంకేతిక వ్యవస్థలను వీరు పొందుపరిచారు. విండోస్ మొబైల్ 7 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేసే ‘హెచ్‌టీసీ మజా’ అతి త్వరలోనే మార్కెట్లో విడుదల కానుంది. అయితే ఈ మొబైల్ ధర రూ.15000లోపు ఉండొచ్చని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot