హెచ్‌టీసీ వన్ ఇ8.. త్వరలో

Posted By:

చైనా వెబ్‌సైట్‌లో గతవారం హల్‌చల్ చేసిన స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ వన్ (ఇ8)ను హెచ్‌టీసీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. హెచ్‌టీసీ వన్ కుటుంబం నుంచి రాబోతున్న ఈ లేటెస్ట్ ఎడిషన్  స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే ఈ నెలలో విడుదల చేయబోతున్నారు. గతంలో వచ్చిన హెచ్‌టీసీ వన్ (ఎమ్7) తరహాలోనే ఈ ఫోన్ డిజైనింగ్ ఉంటుంది. మెటల్ కేసింగ్‌కు బదులుగా పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ బాడీని ఫోన్ నిర్మాణంలో వినియోగంచారు. ఎంపిక చేయబడిన పలు నగరాల్లో హెచ్‌టీసీ వన్ ఇ8ను (నానో సిమ్) వేరియంట్‌లో విక్రయించునున్నట్లు హెచ్‌టీసీ తన అధికారిక బ్లాగ్ ద్వారా వెల్లడించింది. హెచ్‌టీసీ వన్ ఇ8 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

 హెచ్‌టీసీ వన్ ఇ8.. త్వరలో

ఆండ్రాయిడ్ 4.2.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల ఎస్‌ఎల్‌సీడీ3 డిస్‌ప్లే,
పూర్తి హైడెఫినిషన్1080x 1920పిక్సల్ రిసల్యూషన్, 441 పిక్సల్ డెన్సిటీ,
2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 (ఎమ్ఎస్ఎమ్8975ఏసీ) ప్రాసెసర్,
అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్ సౌలభ్యతతో),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే: వై-ఫై, డీఎల్ఎన్ఏ, 4జీ, 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్.
2600ఎమ్ఏహెచ్ నాన్ - రిమూవబుల్ బ్యాటరీ.
ఫోన్ బరువు 145 గ్రాములు,
ఫోన్ పరిమాణం 146.4x70.7x9.9 మిల్లీ మీటర్లు.
ఎలక్ట్రిక్ క్రిమ్సన్, మాల్దీవ్స్ బ్లూ, మిస్టీ గ్రే కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot