మరో ప్రభంజనం...హెచ్‌టీసీ వన్ ఎమ్8

Posted By:

మరో ప్రభంజనం...హెచ్‌టీసీ వన్ ఎమ్8

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ తన లెటెస్ట్ వర్షన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌‍ఫోన్ హెచ్‌టీసీ వన్ ఎమ్8 (HTC One M8)ను మంగళవారం కొత్త ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఏప్రిల్ నుంచి ఈ ఫోన్ మార్కెట్లో లభ్యంకానుంది. ధర ఇంకా ఇతర వివరాలను హెచ్‌టీసీ ఇండియా వెల్లడించలేదు.

హెచ్‌టీసీ వన్ స్మార్ట్‌ఫోన్‌కు సక్ససర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న ఈ డివైస్ శక్తవంతమైన 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ కెపాసిటీ 1080 x 1920 పిక్సల్స్ , 441 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆల్ - మెటల్ ప్రీమియమ్ లుక్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్, 2.3గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 801 ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, గూగుల్ డ్రైవ్ ద్వారా 65జీబి క్లౌడ్ స్టోరేజ్‌ను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం. 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4 మెగా పిక్సల్ అల్ట్రా పిక్సల్ డ్యుయో ఎల్ఈడి ఫ్లాష్ రేర్ కెమెరా, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, 4జీ, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యాక్సిలరోమీటర్...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot