ఇంకా ఒక రోజే?

Posted By: Staff

ఇంకా ఒక రోజే?

 

హెచ్‌టీసీ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన స్బార్ట్‌ఫోన్ ‘వన్ ఎస్’ రేపు ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను జూన్ 8నే విడుదలచెయ్యాల్సి ఉంది. పలు కారణాల చేత విడుదల తేదీని జూన్ 15కు వాయిదా వేశారు. మార్కెట్లో ఈ డివైజ్ ధరను రూ.33,000గా అంచనా వేస్తున్నారు. ఆన్‌లైన్ రిటైలింగ్ సంస్థలైన ‘ద మొబైల్ స్టోర్’, ‘ఇన్ఫీబీమ్’లు హెచ్‌టీసీ వన్ ఎస్‌కు సంబంధించి ముందస్తు ఆర్డర్లను స్వీకరిస్తున్నాయి. ఈ ఫోన్ విడుదల నేపధ్యంలో మార్కెట్ అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలు తారుమారు..?

హెచ్‌టీసీ వన్ ఎస్ ప్రాసెసర్‌కు సంబంధించి పలువురు వేసిన అంచనాలు తారుమారైనట్లు తెలుస్తోంది. తొలిగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను 1.7గిగాహెడ్జ్ సామర్ధ్యం గల ప్రాసెసర్ తో తైవాన్‌లో విడుదల చేశారు. భారత్‌లో కూడా ఇదే వర్షన్ విడుదలవుతుందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే వీరి అంచనాలకు భిన్నంగా 1.5 గిగాహెడ్జ్ సామర్ధ్యం గల ప్రాసెసర్‍‌తో కూడిన వర్షన్‌ను హెచ్‌టీసీ విడుదల చేస్తుంది.

హెచ్‌టీసీ ‘వన్ ఎస్’ ఫీచర్లను పరిశీలిస్తే:

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

డ్యూయల్ కోర్ స్నాప్ డ్రాగెన్ ఎస్4 క్రెయిట్ ప్రాసెసర్,

ఆడ్రినో 224 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్,

4.3 అంగుళా టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

గొరిల్లా గ్లాస్,

8 మెగా పిక్సల్ కెమెరా,

వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ కెమెరా,

బీట్స్ ఆడియో వ్యవస్థ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot