పెద్ద హీరోలకు సెగ..?

Posted By: Prashanth

పెద్ద హీరోలకు సెగ..?

 

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తమదైన స్థానాన్ని పదిలపరుచుకున్నదిగ్గజ శ్రేణి కంపెనీలు సామ్‌సంగ్, హెచ్‌టీసీలకు చైనా బ్రాండ్ లెనోవో నుంచి ఈ డిసెంబర్‌లో గట్టిపోటీ ఎదురుకానుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల తయారీ విభాగంలోకి ఈ మధ్యకాలంలో ఎంట్రీ ఇచ్చిన చైనా కంపెనీ లెనోవో తన ఐడియాఫోన్ సిరీస్ నుంచి ‘పీ770’ మోడల్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఈ డిసెంబర్ అందుబాటులోకి తేనుంది. ఈ ఫోన్ ధర రూ.15,000 నుంచి రూ. 18,000 మధ్య ఉండొచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే..?

పలు అనధికారిక నివేదికల నుంచి సేకరించిన వివరాల మేరకు లెనోవో పీ770 ఫీచర్లు ఈ విధంగా ఉండొచ్చు...

4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,

డ్యూయల్ కోర్ 1.2గిగాహెడ్జ్ ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ (32జీబి ఎక్ప్ ప్యాండబుల్ మెమరీ),

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

3జీ కనెక్టువిటీ,

వై-ఫై, జీపీఎస్,

3,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 29 గంటలు).

గెలాక్సీ ఎస్3, హెచ్‌టీసీ వన్ ఎక్స్‌లకు పోటీ తప్పదా....?

లెనోవో పీ770 ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ వోఎస్ వినియోగించినట్లు రూమర్ మిల్స్ పేర్కొంటున్నాయి. ఇదే వాస్తవమైతే అధికముగింపు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లైన గెలాక్సీ ఎస్3 అలాగే హెచ్‌టీసీ వన్ ఎక్స్‌లు తీవ్రమైన పోటీని ఎదుర్కొనాల్సి ఉంటుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 స్పెసిఫికేషన్‌లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు, ధర రూ.34,900.

హెచ్‌టీసీ వన్ఎక్స్ స్పెసిఫికేషన్‌లు:

4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, క్వాడ్‌కోర్ 1.5గిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా 3 చిప్ సెట్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ 16జిబి/32జీబి, 1జీబి ర్యామ్, వై-ఫై 802.11, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 1800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (8గంటల బ్యాకప్), ధర రూ.32,210.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot