రేపు ప్రదర్శన ఈరోజు లీక్.. 'హెచ్‌టిసి వన్ ఎక్స్'

Posted By: Prashanth

 

రేపు ప్రదర్శన ఈరోజు లీక్.. 'హెచ్‌టిసి వన్ ఎక్స్'

 

ఫిబ్రవరి 26న బార్సిలోనాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మొబైల్ ఈవెంట్ 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ - 2012' కొద్ది గంటల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఐతే ఈ ఈవెంట్లో ప్రముఖ హెచ్‌టిసి కంపెనీ ప్రదర్శన చేయాలని భావించిన కొత్త మొబైల్ 'హెచ్‌టిసి వన్ ఎక్స్' కు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తుండడంతో హెచ్‌టిసి కంపెనీ ఖంగుతింది.

ఇక హెచ్‌టిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనున్న ఈ మొబైల్ ప్రత్యేకతలను గమనించినట్లేతే 1.5GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉండి, NVIDIA Tegra 3 చిఫ్ సెట్‌ని కలిగి ఉంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 4.7 ఇంచ్‌గా రూపొందించడమే కాకుండా హై డెఫినేషన్ రిజల్యూషన్‌ని అందించేందుకు గాను ఇందులో సెకండ్ జనరేషన్ సూపర్ ఎల్‌సిడిని నిక్షిప్తం చేశారు.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తున్నప్పటికీ, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకోవచ్చు. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను 1GB RAMని నిక్షిప్తం చేసారు. ఇందులో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే రెండు సంవత్సరాల పాటు ఆన్ లైన్ స్టోరేజి కోసం 25జిబి డ్రాప్ బాక్స్‌ని ఇచ్చారు. ఇక మొబైల్ కెమెరా విషయానికి వస్తే 8 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు F/2.0 లెన్స్, 1080p వీడియో రికార్డింగ్‌ని తీయవచ్చు.

'హెచ్‌టిసి వన్ ఎక్స్' మొబైల్ గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్‌తో రన్ అవుతుంది. కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలైన బ్లూటూత్, వై - పైలను కూడా ఇది సపోర్టు చేస్తుంది. రేపు 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ - 2012' విడుదలకు సిద్దమైన ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ధరని మార్కెట్లోకి ఇంకా ప్రవేశపెట్ట లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot