దీపావళికి ‘మెరుపు’!

అవును... ఈ దీపావళికి దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఓ మెరుపుమెరవబోతోంది. స్టైలిష్ ఇంకా సొగసరి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హెచ్‌టీసీ తన సరికొత్త అధికముగింపు ఫోన్ ‘వన్ ఎక్స్+’ను ఈ దీపావళికి దేశీయ విపణిలో విడుదల చేయనుంది. ఇఎఫ్ఐ టైమ్స్, నివేదికల మేరకు తైవాన్ స్మార్ట్‌ఫోన్ మేకర్ హెచ్‌టీసీ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆధారితంగా స్పందించే ‘హెచ్‌టీసీ వన్ ఎక్స్+’(హెచ్‌టీసీ వన్ ఎక్స్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్ ) ఈ దీపావళికి ఇండియాను తాకనుంది.
‘వన్ ఎక్స్+’ ఫీచర్లు:
బరువు ఇంకా చుట్టుకొలత: ఫోన్ బరువు 135 గ్రాములు, చుట్టుకొలత 134.36 x 69.9 x 8.9మిల్లీమీటర్లు,
డిస్ ప్లే: 4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2,
ప్రాసెసర్: క్వాడ్ కోర్ 1.7గిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా 3 ఏపీ37 ప్రాసెసర్,
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 4+ యూజర్ ఇంటర్ ఫేస్,
కెమెరా: 8 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్), 1.6మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
స్టోరేజ్: 1జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
కనెక్టువిటీ: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్ 4.0, ఏపీటీఎక్స్,4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఐఈఈఈ 802 ఏ/బి/జి/ఎన్, డీఎల్ఎన్ఏ, మైక్రోయూఎస్బీ 2.0,
బ్యాటరీ: 2100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ టాక్‌టైమ్ 6 గంటలు.
దీపావళి ముందు నుంచే వీటి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో హెచ్‌టీసీ తన సర్వీస్ సెంటర్ల సంఖ్యను 150 నుంచి 300కు పొడిగించనుంది.


Click it and Unblock the Notifications








