హెచ్‌టీసీ వన్ ఎక్స్+ vs డ్రాయిడ్ డీఎన్ఏ (క్వాడ్‌కోర్ కింగ్ ఎవరు?)

Posted By: Prashanth

HTC One X+ vs Droid DNA

 

అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ విపణిలో తన గుర్తింపును మరింత మెరుగుపరుచుకునే క్రమంలో తైవాన్ టెక్‌దిగ్గజం హెచ్‌టీసీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఎడతెరిపిలేకుండా ఆవిష్కరిస్తోంది. ఇటీవల సింగపూర్‌లో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో ఏకంగా నాలుగు స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించేసింది. హెచ్‌టీసీ ‘వన్ ఎక్స్’కు సక్సెసర్ వర్షన్‌గా విడుదలైన ‘వన్ ఎక్స్ +’ ప్రస్తుత మార్కెట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. వేగవంతమైన ప్రాసెసర్, మెరుగైన ఇంటర్నల్ స్టోరేజ్ సామర్ధ్యం, పెద్దదైన బ్యాటరీ ఇంకా 4జీ కనెక్టువిటీ సపోర్ట్ వ్యవస్థలు ఈ గ్యాడ్జెట్‌లో ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. మరో వైపు వెరిజాన్ వైర్‌లెస్‌తో ఒప్పందం కుదర్చుకున్న హెచ్‌టీసీ, ‘జే బటర్‌ఫ్లై’పేరుతో జపాన్‌లో, ‘డ్రాయిడ్ డిఎన్ఏ’ పేరుతో అమెరికాలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. డ్రాయిడ్ డిఎన్ఏ గ్లోబల్ వర్షన్ ‘హెచ్‌టీసీ డీలక్స్’ త్వరలో ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. హెచ్‌టీసీ వన్ ఎక్స్+ అలాగే డ్రాయిడ్ డీఎన్ఏ‌లు ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆధారితంగా స్పందిస్తాయి. ఈ నేపధ్యంలో రెండు గ్యాడ్జెట్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా......

చుట్టుకొలత ఇంకా బరువు....

హెచ్‌టీసీ వన్ ఎక్ప్+: 134.36 x 69.9 x 8.9మిల్లీ మీటర్లు, బరువు 135 గ్రాములు,

హెచ్‌టీసీ డ్రాయిడ్ డీఎన్ఏ: 141 x 70.5 x 9.73మిల్లీ మీటర్లు, బరువు 138 గ్రాములు,

డిస్‌ప్లే.....

హెచ్‌టీసీ వన్ ఎక్ప్+: 4.7అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),

హెచ్‌టీసీ డ్రాయిడ్ డీఎన్ఏ: 5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఎల్‌సీడీ3 డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),

ప్రాసెసర్....

హెచ్‌టీసీ వన్ ఎక్ప్+: క్వాడ్‌కోర్ 1.7గిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా 3 ఏపీ37 ప్రాసెసర్ (ప్రత్యేకతలు: ఉత్తమమైన మల్టీ టాస్కింగ్, హై క్వాలిటీ హైడెఫినిషన్ వీడియో, మన్నికైన గ్రాఫిక్ వ్యవస్థ) ,

హెచ్‌టీసీ డ్రాయిడ్ డీఎన్ఏ: 1.5గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 క్వాడ్-కోర్ ప్రాసెసర్ (ప్రత్యేకతలు: సుధీర్ఘ బ్యాటరీ బ్యాకప్, వేగవంతమైన బ్రౌజింగ్),

ఆపరేటింగ్ సిస్టం:

హెచ్‌టీసీ వన్ ఎక్ప్+: ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: ప్రాజెక్టు బట్టర్, ఆన్-స్రీన్ నేవిగేషన్ బటన్స్, మెరుగుపరచబడిన ఆండ్రాయిడ్ నోటిఫికేషన్స్, రీసైజబుల్ అప్లికేషన్ విడ్జెట్స్, హైరిసల్యూషన్ కాంటాక్ట్ ఫోటోస్, ఆండ్రాయిడ్ బీమ్ అప్లికేషన్),

హెచ్‌టీసీ డ్రాయిడ్ డీఎన్ఏ: ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: ప్రాజెక్టు బట్టర్, ఆన్-స్రీన్ నేవిగేషన్ బటన్స్, మెరుగుపరచబడిన ఆండ్రాయిడ్ నోటిఫికేషన్స్, రీసైజబుల్ అప్లికేషన్ విడ్జెట్స్, హైరిసల్యూషన్ కాంటాక్ట్ ఫోటోస్, ఆండ్రాయిడ్ బీమ్ అప్లికేషన్),

కెమెరా.....

హెచ్‌టీసీ వన్ ఎక్ప్+: 8 మెగాపిక్సల్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్), 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

హెచ్‌టీసీ డ్రాయిడ్ డీఎన్ఏ: 8 మెగాపిక్సల్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, బీఎస్ఐ సెన్సార్), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్....

హెచ్‌టీసీ వన్ ఎక్ప్+: 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్,

హెచ్‌టీసీ డ్రాయిడ్ డీఎన్ఏ: 16జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్, 2జీబి ర్యామ్,

కనెక్టువిటీ....

హెచ్‌టీసీ వన్ ఎక్ప్+: మైక్రో యూఎస్బీ 2.0, వై-పై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎల్‌టీఈ, బ్లూటూత్ కనెక్టువిటీ,

హెచ్‌టీసీ డ్రాయిడ్ డీఎన్ఏ: మైక్రో యూఎస్బీ 2.0, వై-పై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, ఎల్‌టీఈ, బ్లూటూత్ కనెక్టువిటీ,

బ్యాటరీ.....

హెచ్‌టీసీ వన్ ఎక్ప్+: 2100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్),

హెచ్‌టీసీ డ్రాయిడ్ డీఎన్ఏ: 2020ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది),

ధరలు.....

హెచ్‌టీసీ వన్ ఎక్ప్+: రూ.40,190,

హెచ్‌టీసీ డ్రాయిడ్ డీఎన్ఏ: $199 (రూ. 11,000), రెండు సంవత్సరాల ఒప్పందంతో,

ప్రత్యేతలు.....

హెచ్‌టీసీ వన్ ఎక్ప్+: ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, 25జీబి డ్రాప్‌బాక్స్ స్టోరేజ్ ఉచితం (రెండు సంవత్సరాల పాటు), బీఎస్ఐ సెన్సార్ టెక్నాలజీ.

హెచ్‌టీసీ డ్రాయిడ్ డీఎన్ఏ: ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, 50జీబి డ్రాప్ బాక్స్ స్టోరేజ్ ఉచితం (రెండు సంవత్సరాల పాటు), బీఎస్ఐ సెన్సార్ టెక్నాలజీ.

తీర్పు.....

వేగవంతమైన ప్రాసెసర్, మెరుగైన ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లను కోరుకునే వారికి హెచ్‌టీసీ వన్ ఎక్స్+ ఉత్తమ ఎంపిక. పెద్దదైన డిస్‌ప్లే, ఉత్తమ క్వాలిటీ కెమెరా పనితీరును కోరుకునే వారికి డ్రాయిడ్ డీఎన్ఏ బెస్ట్ చాయిస్.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot