తమ్ముడు జోష్‌తో అన్నయ్యకు క్రేజ్ తగ్గుతుందా?

Posted By: Super

 

తైవాన్ స్మార్ట్‌ఫోన్ మేకర్ హెచ్‌టీసీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘హెచ్‌టీసీ వన్‌ఎక్స్’కు అప్‌డేటెడ్ వర్షన్‌గా ‘వన్‌ఎక్స్ +’ను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. దీపావళి కానుకగా దేశీయ మార్కెట్లో లభ్యంకానున్న ఈ డివైజ్ పై ఇప్పటికే అంచనాలు ఊపందుకున్నాయి. 2012, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా స్మార్ట్‌ఫోన్ ప్రపంచానికి పరిచయమైన హెచ్‌టీసీ వన్‌ఎక్స్‌ను ఇండియన్ మార్కెట్లో రెండవ త్రైమాసికంలో విడుదల చేసారు. ఈ డివైజ్ తాజా అప్‌డేట్‌లను పరిశీలిస్తే 16జీబి వర్షన్ ‘వన్ఎక్స్’ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇన్పీబీమ్ రూ.31,299కు ఆఫర్ చేస్తోంది. హెచ్‌టీసీ వన్‌ఎక్స్ ఇతర్ ఆన్‌లైన్ డీల్స్ వివరాలను goProbo.comలో తెలుసుకోవచ్చు. ఒకే గూటి నుంచి డిజైన్ కాబడిన ‘వన్‌ఎక్స్’ ఇంకా ‘వన్‌ఎక్స్ +’ స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా...

బరువు ఇంకా చుట్టుకొలత...

వన్‌ఎక్స్+: చుట్టుకొలత 134.36 x 69.9 x 8.9మిల్లీమీటర్లు, బరువు 135 గ్రాములు,

వన్‌ఎక్స్: చుట్టుకొలత 134.8 x 69.9 x 8.9మిల్లీమీటర్లు, బరువు 130 గ్రాములు,

డిస్‌ప్లే.....

వన్‌ఎక్స్+: 4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,

వన్‌ఎక్స్: 4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,

ప్రాసెసర్:

వన్‌ఎక్స్+: 1.7గిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా 3 ఏపీ37 ప్రాసెసర్,

వన్‌ఎక్స్: 1.5గిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా 3 చిప్ సెట్,

ఆపరేటింగ్ సిస్టం...

వన్‌ఎక్స్+: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం(ప్రత్యేకతలు: ప్రాజెక్ట్ బట్టర్, ఆన్-స్ర్కీన్ నేవిగేషన్ బటన్స్, కాంట్రిక్టిబుల్ ఆండ్రాయిడ్ నోటిఫికేషన్స్, రీసైజబుల్ అప్లికేషన్ విడ్జెట్స్, హై రిసల్యూషన్, ఆండ్రాయిడ్ బీమ్ అప్లికేషన్),

వన్‌ఎక్స్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అప్‌గ్రేడబుల్),

కెమెరా......

వన్‌ఎక్స్+: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో-ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్‌డిటెక్షన్,) 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

వన్‌ఎక్స్: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో-ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్‌డిటెక్షన్,) 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్.....

వన్‌ఎక్స్+: 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్. 1జీబి ర్యామ్,

వన్‌ఎక్స్: 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్,

కనెక్టువిటీ.....

వన్‌ఎక్స్+: వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్ వీ4.0 విత్ ఏ2డీపీ, హెచ్ ఎస్ డిపీఏ, హెచ్ ఎస్ యూపీఏ నెట్ వర్క్స్ సపోర్ట్,

వన్‌ఎక్స్: వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్ వీ4.0 విత్ ఏ2డీపీ, హెచ్ ఎస్ డిపీఏ, హెచ్ ఎస్ యూపీఏ నెట్ వర్క్స్ సపోర్ట్, 4జీ ఎల్ టీఈ కనెక్టువిటీ ఫీచర్లు,

బ్యాటరీ.....

వన్‌ఎక్స్+: 2,100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (6గంటల టాక్ టైమ్),

వన్‌ఎక్స్: 1800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్ టైమ్ 8 గంటలు).

ప్రత్యేకతలు....

వన్‌ఎక్స్+: వేగవంతమైన ప్రాసెసర్, పటిష్టమైన ఇంటర్నల్ స్టోరేజ్ సామర్ధ్యం, పెద్దదైన బ్యాటరీ, 4జీ నెట్ వర్క్ సపోర్ట్, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, సెన్స్ యూజర్ ఇంటర్ ఫేస్,

వన్‌ఎక్స్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, సెన్స్ యూజర్ ఇంటర్ ఫేస్.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot