హెచ్‌టీసీ వన్ ఎక్స్+ x ఎల్‌జి నెక్సస్4 (స్మార్ట్‌ఫోన్ ఫైట్)

Posted By: Prashanth

HTC One X+ vs LG Nexus 4

 

హెచ్‌టీసీ వన్ ఎక్స్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా విడుదలైన ‘వన్ ఎక్స్+’ ప్రస్తుత మార్కెట్లో హాట్ టాపిక్‌. వేగవంతమైన ప్రాసెసర్, మెరుగైన ఇంటర్నల్ స్టోరేజ్, పెద్దదైన బ్యాటరీ, 4జీ సపోర్ట్ వంటి ప్రత్యేకతలు ఈ స్మార్ట్ హ్యండ్‌సెట్‌లో ఒదిగి ఉన్నాయి. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ డాట్ కామ్ ‘వన్ ఎక్స్+’ను రూ.39,500కు ఆఫర్ చేస్తోంది. మరోవైపు గూగుల్ బ్రాండెడ్ ఫోన్ నెక్సస్ 4ను ఎల్‌జి ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ పై స్పందించే ఈ డివైజ్ ప్రీఆర్డర్ పై లభ్యమవుతోంది. ధరలు 8జీబి - రూ.23,490, 16జీబి - రూ.27,490. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా.....

అభిమాని అంటే వీడేరా…! (ఫోటో గ్యాలరీ)

బరువు ఇంకా చుట్టుకొలత.......

హెచ్‌టీసీ వన్ ఎక్స్+: చుట్టుకొలత 134.36 x 69.9 x 8.9మిల్లీ మీటర్లు, బరువు 135 గ్రాములు,

ఎల్‌జి నెక్సస్ 4: చుట్టుకొలత 134.2 x 68.6 x 9.1మిల్లీ మీటర్లు, బరువు 139 గ్రాములు,

డిస్‌ప్లే...

హెచ్‌టీసీ వన్ ఎక్స్+: 4.7 అంగుళాల ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,

ఎల్‌జి నెక్సస్ 4: 4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్,

ప్రాసెసర్......

హెచ్‌టీసీ వన్ ఎక్స్+: క్వాడ్ కోర్ 1.7గిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా 3 ఏపీ37 ప్రాసెసర్,

ఎల్‌జి నెక్సస్ 4: 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం....

హెచ్‌టీసీ వన్ ఎక్స్+: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

ఎల్‌జి నెక్సస్ 4: ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా......

హెచ్‌టీసీ వన్ ఎక్స్+: 8 మెగా పిక్సల్ కెమెరా, 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

ఎల్‌జి నెక్సస్ 4: 8 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు.

స్టోరేజ్.......

హెచ్‌టీసీ వన్ ఎక్స్+: 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్,

ఎల్‌జి నెక్సస్ 4: ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ 8జీబి, 16జీబి, 2జీబి ర్యామ్,

కనెక్టువిటీ.......

హెచ్‌టీసీ వన్ ఎక్స్+: వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్ వీ4.0 విత్ ఏ2డీపీ, 4జీ ఎల్టీఈ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

ఎల్‌జి నెక్సస్ 4: వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్ వీ4.0 విత్ ఏ2డీపీ, 4జీ ఎల్టీఈ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,

బ్యాటరీ......

హెచ్‌టీసీ వన్ ఎక్స్+: 2100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్‌టైమ్ 6 గంటలు),

ఎల్‌జి నెక్సస్ 4:2100ఎమ్ఏహఎచ్ లిపో బ్యారటీ (15.3గంటల టాక్ టైమ్, 390 గంటల స్టాండ్ బై),

ధరలు.....

హెచ్‌టీసీ వన్ ఎక్స్+: ధర రూ.39,500,

ఎల్‌జి నెక్సస్ 4: 8జీబి వేరియంట్ - రూ.23,490, 16జీబి వేరియంట్ - రూ.27,490.

ప్రత్యేకతలు......

హెచ్‌టీసీ వన్ ఎక్స్+: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్, 25జీబి ఉచిత డ్రాప్ బాక్స్ స్టోరేజ్ (రెండు సంవత్సరాలు ఉచితం).

ఎల్‌జి నెక్సస్ 4: ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఆధునిక సాఫ్ట్ వేర్ ఫీచర్లు,

తీర్పు.....

వేగవంతమైన ప్రాసెసర్, ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను కోరుకునే వారికి హెచ్‌టీసీ వన్ ఎక్స్+ ఉత్తమ ఎంపిక. మెరుగైన టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, శక్తివంతమైన బ్యాటరీ ఇంకా తక్కవ ధరను కోరుకునే వారికి ఎల్‌జి నెక్సస్4 బెస్ట్ చాయిస్.

టాప్-5 ఫీచర్ ఫోన్స్ (లేటెస్ట్)!

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot