వాళ్లిద్దరిలో కింగ్ ఎవరు..?

By Prashanth
|
తెవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ హెచ్‌టీసీ తన లైనప్‌ను మరింత పటిష్టం చేస్తూ ‘వన్ ఎక్స్ +’పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ‘వన్ ఎక్స్’కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా డిజైన్ కాబడిన ఈ సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ డివైజ్ ఆండ్రాయిడ్ లెటేస్ట్ వర్షన్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, వేగవంతమైన ప్రాసెసర్, పటిష్టమైన మెమెరీ, పెద్దదైన బ్యాటరీ, 4జీ సపోర్ట్ వంటి ప్రత్యేకతలను ఒదిగి ఉంది. మరో వైపు మైక్రోసాఫ్ట్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 8’తో ముస్తాబైన నోకియా లూమియా 920 విడుదలకు సిద్ధంగా ఉంది. వైర్‌లెస్ చార్జింగ్, గ్లవ్ ఫ్రెండ్లీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే వంటి ప్రత్యేక ఫీచర్లతో పాటు అత్యుత్తమ కెమెరా వ్యవస్థను లూమియా 920లో పొందుపరిచారు. వేరు వేరు ఆపరేటింగ్ సిస్టంలు ఒదిగి ఉన్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌ల పై విశ్లేషణ.

బరువు ఇంకా చుట్టుకొలత:

హెచ్‌టీసీ వన్ఎక్స్+: చుట్టుకొలత 134.36 x 69.9 x 8.9మిల్లీమీటర్లు, బరువు 135 గ్రాములు,

నోకియా లూమియా 920: చుట్టుకొలత 130.3 x 70.8 x 10.7 మిల్లీమీటర్లు, బరవు 185 గ్రాములు.

డిస్‌ప్లే:

హెచ్‌టీసీ వన్ఎక్స్+: 4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,

నోకియా లూమియా 920: 4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హెచ్‌డి+ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,

ప్రాసెసర్:

హెచ్‌టీసీ వన్ఎక్స్+: 1.7గిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా3 ఏపీ37 ప్రాసెసర్,

నోకియా లూమియా 920: డ్యూయల్ కోర్ 1.5గిగాహెర్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం:

హెచ్‌టీసీ వన్ఎక్స్+: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

నోకియా లూమియా 920: విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

హెచ్‌టీసీ వన్ఎక్స్+: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్ డిటెక్షన్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

నోకియా లూమియా 920: 8.7 మెగాపిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటోఫోకస్, జియో-టాగింగ్, ప్యూర్‌వ్యూ కెమెరా టెక్నాలజీ), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు).

స్టోరేజ్:

హెచ్‌టీసీ వన్ఎక్స్+: 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్,

నోకియా లూమియా 920: 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 7జీబి మైక్రోసాఫ్ట్ స్కై డ్రైవ్ స్టోరేజ్,

కనెక్టువిటీ:

హెచ్‌టీసీ వన్ఎక్స్+: వై-ఫై 802.11 a/b/g/n, డ్యూయల్ బ్యాండ్, డీఎల్ఎన్ఏ, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్ వీ4.0 విత్ ఏ2డీపీ, హెచ్‌ఎస్‌డీపీఏ, హెచ్‌ఎస్‌యూపీఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ ఎల్‌టీఈ.

నోకియా లూమియా 920: హెచ్‌ఎస్‌డీపీఏ, హెచ్‌ఎస్‌యూపీఏ, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 802.11 a/b/g/n, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, క్యూ ఐ వైర్ లెస్ చార్జింగ్, 4జీ ఎల్‌టీఈ,

బ్యాటరీ:

హెచ్‌టీసీ వన్ఎక్స్+: 2100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్),

నోకియా లూమియా 920: 2,000ఎమ్ఏహెచ్ Li-ion బ్యాటరీ (టాక్ టైమ్ 10 గంటలు, స్టాండ్ బై 400 గంటలు),

తీర్పు:

హెచ్‌టీసీ వన్ ఎక్స్ +, బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్ వంటి ప్రత్యేకమైన ఆడియో ఫీచర్లను కలిగి ఉంది. లూమియా 920లో నిక్షిప్తం చేసిన వైర్‌లెస్ చార్జింగ్, గ్లవ్ ఫ్రెండ్లీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే వంటి ప్రత్యేక ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. తక్కువ బరువు, వేగవంతమైన ప్రాసెసింగ్, పెద్దదైన డిస్‌ప్లే ఇంకా ఆధునిక ఆండ్రాయిడ్ అనుభూతులను పొందాలనుకునే వారికి ‘వన్ ఎక్స్+’ ఉత్తమ ఎంపిక. హై క్వాలిటీ కెమెరా, వైర్‌లెస్ చార్జింగ్ ఇంకా వివిధ కలర్ వేరియంట్‌లను కోరుకునే వారికి లూమియా 920 బెస్ట్ చాయిస్.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X