ఛాలెంజర్ vs ఛాంపియన్!

Posted By: Prashanth

HTC One X+ vs Samsung Galaxy S3

 

స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ మేకర్ హెచ్‌టీసీ తన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను మరింత పటిష్టం చేస్తూ డిజైన్ చేసిన స్మార్ట్‌ఫోన్ ‘హెచ్‌టీసీ వన్ ఎక్స్+’. హెచ్‌టీసీ వన్ ఎక్స్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా రాబోతున్న ఈ డివైజ్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘జెల్లీబీన్ 4.1’ను ఒదిగి ఉంది. అదేవిధంగా వేగవంతమైన ప్రాసెసర్, మెరుగైన బ్యాటరీ బ్యాకప్ వంటి అంశాలు ప్రత్యేకతలుగా నిలిచాయి. మరో వైపు సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్3’ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అప్‌‍గ్రేడ్‌ కు సిద్ధమవుతోంది. 100 రోజుల్లో 20 మిలియన్ యూనిట్ల అమ్మకాలను అధిగమించిన గెలాక్సీ ఎస్3తో, రాబోతున్న హెచ్‌టీసీ వన్ ఎక్స్+, స్పెసిఫికేషన్‌ల పరంగా ఏమేరకు పోటీనివ్వగలదో చూద్దాం....

బరువు ఇంకా చుట్టుకొలత:

హెచ్‌టీసీ వన్ఎక్స్+: చుట్టుకొలత 134.36 x 69.9 x 8.9మిల్లీమీటర్లు, బరువు135 గ్రాములు,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3: చుట్టుకొలత 136.6 x 70.6 x 8.6మిల్లీమీటర్లు, బరువు 133 గ్రాములు,

డిస్‌ప్లే:

హెచ్‌టీసీ వన్ఎక్స్+: 4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 312పీపీఐ పిక్సల్ డెన్సిటీ,

గెలాక్సీ ఎస్3: 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, 306పీపీఐ పిక్సల్ డెన్సిటీ,

ప్రాసెసర్:

హెచ్‌టీసీ వన్ఎక్స్+: 1.7గిగాహెడ్జ్ ఎన్-విడియా టెగ్రా3 ఏపీ37 ప్రాసెసర్,

గెలాక్సీ ఎస్3: ఎక్సినోస్ 4412 క్వాడ్ చిప్‌సెట్,

ఆపరేటింగ్ సిస్టం:

హెచ్‌టీసీ వన్ఎక్స్+: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

గెలాక్సీ ఎస్3: ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం),

కెమెరా:

హెచ్‌టీసీ వన్ఎక్స్+: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్ డిటెక్షన్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

గెలాక్సీ ఎస్3: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్ డిటెక్షన్), 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్:

హెచ్‌టీసీ వన్ఎక్స్+: 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్,

గెలాక్సీ ఎస్3: ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వేరియంట్స్ 16జీబి, 32జీబి, 64జీబి, 2జీబి ర్యామ్,

కనెక్టువిటీ:

హెచ్‌టీసీ వన్ఎక్స్+: వై-ఫై 802.11 a/b/g/n, డ్యూయల్ బ్యాండ్, డీఎల్ఎన్ఏ, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్ వీ4.0 విత్ ఏ2డీపీ, హెచ్‌ఎస్‌డీపీఏ, హెచ్‌ఎస్‌యూపీఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ ఎల్‌టీఈ.

గెలాక్సీ ఎస్3: వై-ఫై 802.11 b/g/n, వై-ఫై డైరెక్ట్, డీఎల్ఎన్ఏ, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, మైక్రోయూఎస్బీ 2.0, హెచ్‌ఎస్‌డీపీఏ, హెచ్‌ఎస్‌యూపీఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్.

బ్యాటరీ:

హెచ్‌టీసీ వన్ఎక్స్+: 2100ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్),

గెలాక్సీ ఎస్3: 2100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (11.5 గంటల టాక్‌టైమ్, 790 గంటల స్టాండ్‌బై),

తీర్పు:

ఈ రెండు స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లలో ఒకటైన గెలాక్సీ ఎస్3 ఇప్పటికే మార్కెట్లో విడుదలై అమ్మకాల పరంగా సంచలనాలు రేపుతోంది. మరో వైపు హెచ్‌టీసీ వన్‌ ఎక్స్+ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఫోన్‌లకు సంబంధించి ఆపరేటింగ్ సిస్టం విషయంలో తేడాలను గమనించవచ్చు. వన్ ఎక్స్+ ఆండ్రాయిడ్ లేటెస్డ్ వర్షన్ జెల్లీబీన్ వోఎస్ పై రన్ అవుతుండగా, గెలాక్సీ ఎస్3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఏది ఉత్తమమైనదో ఎంపిక చేయాలంటే వన్ ఎక్స్+ విడుదల వరకు వేచి చూడక తప్పదు.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot