కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ని కొనేందుకు సిద్దమైన హెచ్‌టిసి

Posted By: Staff

కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ని కొనేందుకు సిద్దమైన హెచ్‌టిసి

మొబైల్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలో అత్యున్నత శిఖరాలకు చేరిన మొబైల్ తయారీదారు హెచ్‌టిసి. అలాంటి హెచ్‌టిసి మొబైల్ సంస్ద త్వరలో ఓ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ని కొనుగోలు చేయనున్నట్లు వినికిడి. ముఖ్యంగా స్మార్ట్ పోన్స్‌ని దృష్టిలో పెట్టుకోని ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తైవాన్ న్యూస్ అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్బంలో ‌హెచ్‌టిసి కంపెనీ సిఈవో చెర్ వాంగ్ మాట్లాడుతూ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ని కొనుగోలు చేయాలనుకున్న మాట వాస్తవమేనని అన్నారు.

ఇంతకీ హెచ్‌టిసి కొనుగోలు చేయనున్న ఆ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటని అనుకుంటున్నారా.. ఇంటర్నెట్‌లో వచ్చిన రూమర్స్ ప్రకారం 'హెచ్‌పి పామ్ వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్'ని కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల స్మార్ట్ పోన్స్ యొక్క ఫెర్పామెన్స్ వృద్ది చెందడమే కాకుండా, యూజర్‌కి ఇంటర్ ఫేస్ కూడా అనుకూలంగా ఉంటుంది. చెర్ వాంగ్ చెప్పిన మాటలను గమనించిన చైనా రచయిత చెప్పిందేమిటంటే హెచ్‌టిసి కంపెనీ ఏదో అతృతగా ఆపరేటింగ్ సిస్టమ్‌ని కోనాలను అనుకోవడం లేదని స్పష్టం చేశారు.

మొబైల్ మార్కెట్లో హెచ్‌టిసి కంపెనీ ఏది చేసినా అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా మార్కెట్లో రెండు, మూడు స్దానాలలో ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేసి వాటిని నెంబర్ వన్ స్దానానికి చేర్చడమే హెచ్‌టిసి ముఖ్య ఉద్దేశ్యం. వీటితో పాటు హెచ్‌టిసి కొత్తగా ప్రవేశపెట్టనున్న మరో విషయం ఏమిటంటే కేవలం ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్‌కే పరిమితం కాకుండా ఒకే కంపెనీ స్మార్ట్ పోన్స్‌లలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ లతో రూపోందిచడం.

ప్రస్తుతం హెచ్‌టిసి మొబైల్స్‌ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తుండడంతో బైదు ఆపరేటింగ్ సిస్టమ్, ఆలీయాన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ లతో కూడా మరికొన్ని స్మార్ట్ పోన్స్‌‌ని రూపోందించనున్నట్లు సమాచారం. ఇలా చేయడానికి గల కారణం కస్టమర్స్ యొక్క అభిరుచులకు తగ్గట్లుగా మొబైల్స్‌ని రూపొందించినప్పుడే మార్కెట్లో ఎక్కువ కాలం మన్నగలుగుతామని తెలియజేశారు. ఇందులో భాగంగానే శ్యామ్‌సంగ్ మొబైల్స్ ఇటీవలే గూగుల్ ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్ 7, బడా ఆపరేటింగ్ సిస్టమ్‌లతో టై అప్ అయిన విషయం తెలిసిందే.

హెచ్‌టిసి ఈ సంవత్సరం ఆపరేటింగ్ సిస్టమ్‌ని కొనుగోలు చేసేందుకు సిద్దంగా లేకపోయినప్పటికీ, 2012లో బార్సిలోనా, స్పెయిన్‌లో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ మీటింగ్ లో తన భవిష్యత్తు ప్రణాళికను వెల్లడిస్తుందని తెలిపారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot