డేట్ ఫిక్స్.. ఇక రచ్చే!!

Posted By: Prashanth

డేట్ ఫిక్స్.. ఇక రచ్చే!!

 

ప్రతిష్టాత్మకంగా హెచ్‌టీ‌సీ డవలెప్ చేస్తున్న న్యూ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీ ప్రక్రియ దాదాపు తది దశకు చేరుకుంది. ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదిక పై ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తునట్లు తెలిసింది.

హెచ్‌టీసీ వన్ వీ ( HTC One V) నమూనాలో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ డివైజ్ ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేశారు. డిస్‌ప్లే 3.7 అంగుళాల పరిమాణాన్ని కలిగి మల్టీ టచ్ ఆధారితంగా స్పందిస్తుంది. ర్యామ్ సామర్ద్యం 512ఎంబీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమెరీని వ్ళద్ధి చేసుకోవచ్చు. ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీ ఫీచర్లతో కూడిన 5 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. తద్వారా క్వాలిటీతో కూడిన ఫోటోలను చిత్రీకరించటంతో పాటు హై డెఫినిషన్ క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. వై-ఫై వ్యవస్థ బ్రౌజింగ్ సామర్ధ్యాన్ని బలోపేతం చేస్తుంది. దోహదం చేసిన బ్లూటూత్, యూఎస్బీ వ్యవస్థలు డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. జీపీఎస్ వ్యవస్థ యూజర్ ఫ్రెండ్లీ నావిగేషన్‌కు తోడ్పడుతుంది. ధర ఇతర వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot