ఫ్లాష్.. ఫ్లాష్ ‘ఫస్ట్ లుక్’ లీక్ చేశారు?

Posted By: Prashanth

ఫ్లాష్.. ఫ్లాష్ ‘ఫస్ట్ లుక్’ లీక్ చేశారు?

 

స్టైలిష్ బ్రాండ్ ‘హెచ్‌టీసీ’ ప్రత్యుర్థి బ్రాండ్‌లకు షాకిచ్చే న్యూస్‌తో టెక్ ప్రపంచంలో వాలి పోయింది. ఈ తైవానీస్ ఫోన్ మేకర్ తాజా ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక వివరాలను ఓ ప్రముఖ టెక్ పోర్టల్ బహిర్గతం చేసింది. హెచ్‌టీసీ ప్రోటో (HTC Proto)గా ఐఏఫ్ఏ 2012లో పరిచయం కాబోతున్న హెచ్‌టీసీ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఫస్ట్‌లుక్‌ను సదరు పోర్టల్ లీక్ చేసింది. ఇప్పటికే హెచ్‌టీసీ విడుదల చేసిన ‘వన్ సిరీస్’ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో ప్రత్యేక డిమాండ్ ఉంది.

Read In English

హెచ్‌టీసీ ‘వన్ వీ’కి రిఫ్రెష్ వెర్షన్‌గా డిజైన్ కాబడినట్లు భావిస్తున్న హెచ్‌టీసీ ‘ప్రోటో’ ఫీచర్లు దివెర్జ్(TheVerge) రిపోర్ట్ ఆధారంగా:

9.62మిల్లీమీటర్ల మందం,

4 అంగుళాల WVGA SLCD డిస్‌ప్లే,

5 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

512ఎంబీ ర్యామ్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ఎస్4 ఎమ్ఎస్ఎమ్8225 ప్రాసెసర్,

7.2ఎంబీపీఎస్ హెచ్ఎస్‌పీఏ,

బ్లూటూత్,

1650ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

హెచ్‌టీసీ వన్ v ఫీచర్లు:

* డ్యూయల్ కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్ (క్లాక్ స్పీడ్ 1 GHz), * గుగూల్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, * 3.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 320 పిక్సల్స్) , * 5 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా(హై డిఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో), * వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, * 8జీబి ఇంటర్నల్ మెమెరీ, * 1జీబి ర్యామ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot